కావాలనే చంద్రబాబుపై కేసు నమోదు..: యనమల

టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు.

కావాలనే కుట్ర పూరితంగా చంద్రబాబుపై కేసు పెట్టారని పేర్కొన్నారు.

తప్పుడు కేసులు బనాయించి చంద్రబాబును వేధిస్తున్నారని యనమల ఆరోపించారు.జైలులో ఉన్న కూడా చంద్రబాబు ప్రజల కోసమే ఆలోచిస్తున్నారన్న యనమల పార్టీ కార్యకర్తల గురించి చంద్రబాబు అడిగారని తెలిపారు.

అక్రమ కేసుల్లో ఇరుకున్న పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలని చెప్పారని వెల్లడించారు.చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు.

కాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో కుటుంబ సభ్యులు భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలతో పాటు సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు కూడా ములాఖత్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide