కొండపై నుంచి జారిపడ్డ ఒంటె.. చివరికి షాక్

ఎవరైనా ఎత్తైన ప్రాంతం నుంచి జారి పడితే దెబ్బల సంగతి అటుంచితే, ప్రాణాలు దక్కుతాయన్న గ్యారంటీ లేదు.

పైపెచ్చు కొండల నుంచి అయితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే.

మామూలుగా అయితే నడుస్తున్నప్పుడు జారి పడినా మన కాలు, లేదా చెయ్యి, లేక మరేదైనా శరీరంలో అవయవాలు గాయపడతాయి.ఏదో ఒక ఎముక విరిగి మనం ఆసుపత్రి పాలవుతాం.

మనకు నోరు ఉంటుంది కాబట్టి ఏదైనా దెబ్బ తగిలితే అరుస్తాం.అయితే నోరు లేని మూగ జీవాల విషయంలో ఏం జరిగినా మనకు తెలియదు.

తాజాగా ఓ ఒంటె ఏకంగా ఎత్తైన కొండ పై నుంచి జారి పడింది.ఆ తర్వాత జరిగిన ఆసక్తికర పరిణామం ఇలా ఉంది.

Advertisement
A Camel Slides From Mountain And Falls Down Viral Video Details, Hill, Fallen,

ఇటీవల నెట్టింట ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది.రాజీవ్ సూద్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

అందులో ఓ ఒంటె కొండపై నుంచి జారి పడింది.సాధారణంగా ఒంటెలు మెట్లెక్కి దిగడం, కొండలు వంటి ప్రాంతాల్లో నడవడం కొంచెం కష్టం.

అయితే ఓ ఒంటె ఏకంగా కొండ పై నుంచి కిందికి పడడం చూసి అందరూ అది చనిపోతుందని అనుకున్నారు.ఆశ్చర్యకరంగా అలాంటి ఘటన ఏదీ జరగలేదు.

అదృష్టవశాత్తూ ఆ ఒంటె సురక్షితంగా ఉంది.

A Camel Slides From Mountain And Falls Down Viral Video Details, Hill, Fallen,
వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

కింద పడేటప్పుడు ఆ ఒంటె పని అయిపోందని భావించిన వారికి షాక్ తగిలింది.అది కిందపడినా వెంటనే పైకి లేచింది. ఏమీ కానట్టు తిరిగి తన ప్రయాణం కొనసాగించింది.

Advertisement

దీనిని ట్విట్టర్‌లో షేర్ చేయగానే ఎన్నో కామెంట్లు, షేర్లు వస్తున్నాయి.కింద పడినా, పైకి లేచి ఆ ఒంటె ప్రయాణం సాగించిన తీరు ఎందరికో ఆదర్శమని నెటిజన్లు కొనియాడుతున్నారు.

పలువురు దీనిని సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు