మరింత జాగ్రత్తగా కెరియర్ ప్లాన్లో నాని..!

నాచురల్ స్టార్ నాని క్రేజ్ ఈ టైంలో తన సినిమాల రిజల్ట్ చూస్తే అర్ధమవుతుంది.

వరుస హిట్స్ తో జోరుమీదున్న నాని ఇక నుండి కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నాడు.

ఎవడే సుబ్రమణ్యం కంటే ముందు నాని కెరియర్ అయోమయంగా ఉంది.ఇక తాను నటించిన జెండా పై కపిరాజు, పైసా మూవీలు కూడా ఫ్లాప్ అవ్వడం కెరియర్ మీద పెద్ద దెబ్బేశాయి.

అయినా సరే మళ్లీ తనకు నచ్చిన సినిమాలతో అందరిని ఇంప్రెస్ చేశాడు నాని.హ్యాట్రిక్ హిట్స్ కొట్టి మరో హ్యాట్రిక్ కు నాంధి పలికిన నాని ప్రస్తుతం దిల్ రాజు, జెమిని కిరణ్ ల నిర్మాణ సారధ్యంలో సినిమాలు చేస్తున్నాడు.

కెరియర్ లో మొన్నటిదాకా తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల బాధపడ్డ నాని ఇక నుండి అలాంటి వాటికి స్కోప్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడట.తన మనసుకి నచ్చితే తప్ప ఎవరి బలవంతం చేసినా, మొహమాట పెట్టినా సినిమాలు చేసేది లేదు అని అందరికి చెబుతున్నాడట.

Advertisement

మరి నానిలో వచ్చిన ఈ మార్పు తన ఖాతాలో మరిన్ని హిట్ సినిమాలు వచ్చేలా చేయాలని ఆశిద్దాం.

ఈ సూపర్ హిట్ సినిమాల్లో మొదట అనుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు