ఈ 8 ఆహారాలు డైట్ లో ఉంటే మీ బ్రెయిన్ మెరుపు వేగంతో పని చేస్తుంది తెలుసా?

ప్రతి మనిషికి శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్య కూడా ఎంతో ముఖ్యం.సమాజంలో మంచి గుర్తింపు రావాలంటే తెలివితేటలు బాగా ఉండాలి.

బ్రెయిన్ షార్ప్ గా పని చేయాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే 8 ఆహారాలు చాలా బాగా సహాయపడతాయి.

మెదడు మెరుపు వేగంతో పనిచేసేందుకు ఎంతగానో సహకరిస్తాయి.మరి ఇంత‌కీ ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

బీట్ రూట్( Beet root ).అన్ని దుంపల్లో అమోఘమైనది.ఎన్నో విలువైన పోషకాలు కలిగి ఉండే బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Advertisement

అలాగే మెదడు పనితీరును మెరుగుపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.తరచూ బీట్ రూట్ జ్యూస్ ను తీసుకుంటే బ్రెయిన్ సూపర్ షార్ప్ గా మారుతుంది.

మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడే ఆహారాల్లో పసుపు( Turmaric ) ఒకటి.అనేక జబ్బుల‌ను నివారించడానికి పసుపు చాలా ఎఫెక్టివ్‌ గా పని చేస్తుంది.అలాగే ఆరోగ్యపరంగా బోలెడన్ని ప్రయోజనాలు అందిస్తుంది.

నిత్యం పసుపు ఏదో ఒక రూపంలో తీసుకుంటే జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి కూడా రెట్టింపు అవుతాయి.బ్రెయిన్ మెరుపు వేగంతో పని చేయాలంటే మీ డైట్ లో డార్క్ చాక్లెట్ ఉండాల్సిందే.

ప్రతిరోజు పరిమితంగా డార్క్ చాక్లెట్( Dark chocolate ) ను తీసుకుంటే మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది.ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడే వాటిలో కొబ్బరి నూనె కూడా ఒకటి.చాలా మంది వంటలకు ఏవేవో నూనెలు వాడుతుంటారు.

Advertisement

కానీ కొబ్బరి నూనె వాడితే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం సైతం చాలా బాగుంటుంది.

అవకాడో.మెదడు పనితీరును పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.రోజుకు ఒక అవకాడో పండును తీసుకుంటే బ్రెయిన్ వేగంగా పనిచేస్తుంది.

అదే సమయంలో ఆల్జీమర్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధి వచ్చే రిస్క్ తగ్గుతుంది.పచ్చి ఉల్లిపాయ ( onion )సైతం మెదడు ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప‌చ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల ఆలోచన శక్తి రెట్టింపు అవుతుంది.పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.

ఆకుకూరల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ను ఇంప్రూవ్ చేసే వాటిలో బ్రోకలీ ముందు వరుసలో ఉంది.అందుకే నిపుణులు వారానికి రెండు సార్లు అయినా బ్రోకలీని డైట్ లో చేరుకోమంటున్నారు.

ఇక పప్పు ధాన్యాలు కూడా మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.పప్పు ధాన్యాల‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి.

మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది.

తాజా వార్తలు