విదేశాల్లో భారతీయ విద్యార్ధుల మరణాలు.. ఐదేళ్లలో అంతమందా..?

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్ధుల( Indian Students ) సంఖ్య ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతోంది.

ఒకరిని చూసి మరొకరు మన పిల్లలంతా ఛలో ఫారిన్ అంటున్నారు.

దీంతో ఆయా దేశాల్లోని విద్యాసంస్థలు భారతీయ విద్యార్ధులతో కిటకిటలాడుతున్నాయి.అయితే అక్కడ హత్యలు, యాక్సిడెంట్లు, అనారోగ్యం, ఇతర కారణాలతో మన విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు.

జీవితంలో గొప్ప స్థితికి చేరుకుంటారనుకున్న తమ బిడ్డలు తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కొన్ని దేశాల్లో ఉన్న పరిస్ధితులతో తల్లిదండ్రులు.

తమ పిల్లలను విదేశాలకు పంపాలంటేనే వణికిపోతున్నారు.

Advertisement

గడిచిన ఐదేళ్ల కాలంలో దాదాపు 633 మంది భారతీయ విద్యార్ధులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం లోక్‌సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్( Kirti Vardhan Singh ) ఈ మేరకు గణాంకాలు వెల్లడించారు.172 కేసులతో ఈ లిస్టులో కెనడా( Canada ) అగ్రస్థానంలో ఉండగా.అమెరికాలో( America ) 108, యూకేలో 58 , ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, ఉక్రెయిన్‌లో 18, జర్మనీలో 24, జార్జియా, కిర్గిస్తాన్, సైప్రస్‌లలో 12, చైనాలో 8 మంది విద్యార్ధులు మరణించినట్లు పేర్కొన్నారు.

అలాగే 19 మంది భారతీయ విద్యార్ధులు దాడుల్లో చనిపోయినట్లు మంత్రి తెలిపారు.ఈ తరహా ఘటనల్లో కెనడాలో 9 మంది, అమెరికాలో ఆరుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయినట్లు కీర్తి వర్ధన్ చెప్పారు.

మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సహజ మరణాలు, ప్రమాదాలు, వైద్య పరిస్ధితులు సహా వివిధ కారణాల వల్ల ఐదేళ్లలో విదేశాలలో భారతీయ విద్యార్ధుల మరణాలు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.విదేశాలలో ఉన్న భారతీయ విద్యార్ధుల భద్రత తమ ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకనటి ఆయన తెలిపారు.విదేశాల్లోని భారతీయ మిషన్లు/ పోస్టులు విదేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన భారతీయ విద్యార్ధులతో టచ్‌లో ఉంటున్నాయని కీర్తి వర్ధన్ పేర్కొన్నారు.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు