విమానాన్ని కూడా వదల్లేదు...ఆ 50 ఏళ్ల వ్యక్తి సడన్ గా లేచి విమానంలో చేసిన దానికి అందరు షాక్

మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా బిచ్చగాళ్లు కామన్‌గా మనకు కనిపిస్తారు.ట్రాఫిక్‌ సిగ్నల్స్ వద్ద, బస్టాండ్లలో, ఆలయాల వద్ద.

ప్రస్తుతం చిన్నపాటి హోటల్స్‌, కర్రీ పాయింట్ల వద్ద కూడా వారు ఉంటున్నారు.ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో తిరిగే వారి దగ్గరకు బిచ్చగాళ్లు వచ్చి అడుక్కుంటూ ఉంటారు.

ఈ క్రమంలో జాలి కలిగిన కొందరు వారికి డబ్బులు ఇస్తారు.కొందరికైతే అలా ఇవ్వడం నచ్చదు.

వారు డబ్బులు లేవని పంపిస్తారు.మరి కొందరికి అసలు బిచ్చగాళ్లంటేనే పడదు.

Advertisement

దీంతో వారు బిచ్చగాళ్లు దగ్గరికి వస్తే విసుక్కుంటారు.అయితే కొందరు మాత్రం బిచ్చగాళ్లకు దానం ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు.

ఇవ్వకపోతే బాగుండదేమో అనుకుంటారు.ఇస్తే.

ఛ.అసలు అలాంటి వారికి ఎందుకు దానం చేశాం అని ఫీలవుతారు.రోడ్లపై బిచ్చగాళ్ళు కనిపిస్తే పెద్ద వింతేమీ కాదు.కానీ విమానంలో కూడా అడుక్కుంటే అది షాకింగ్ వార్త అన్నట్టే.మీరు విన్నది నిజమే.

అడుక్కోవడానికి కూడా ప్రదేశంతో సంబంధం లేదని నిరూపించాడు ఓ 50 ఏళ్ల మధ్య వయస్కుడు.ఇంతకూ ఇతను అడుక్కున్నది ఎక్కడనుకుంటున్నారు.

అమ్మ మీద కోపం తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సిరి వెన్నెల

ఆకాశంలో ఎగురుతున్న విమానంలో.అవును విమానంలోనే అడుక్కుంటున్నాడు.

Advertisement

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌ చేస్తూ వైరల్‌గా మారింది ఈ వీడియో.దోహా నుంచి షిరాజ్‌ ప్రయాణిస్తున్న విమానంలో ఆకస్మాత్తుగా ఓ మధ్యవయస్కుడు లేచి చేతిలో ప్లాస్టిక్‌ పౌచ్‌ పట్టుకుని తన తోటి ప్రయాణికుల దగ్గరకు వెళ్లి అడుక్కోవడం ప్రారంభించాడు.

కొందరు అతనికి డబ్బులు కూడా ఇచ్చారు.ఇంతలో ఎయిర్‌లైన్‌ సిబ్బంది వచ్చి అతన్ని వారించడంతో వెళ్లి తన సీటులో కూర్చున్నాడు.

సోషల్‌ మీడియాలో వైరలవుతున్న ఈ వీడియో గురించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.కొందరైతే ఏకంగా అడుకుంటున్న వ్యక్తిని పాకిస్తానీగా భావించి.

‘ఈ ప్రయాణికుడు ప్రస్తుతం మన దేశంలో ఉన్న అవినీతికి నిదర్శంగా నిలుస్తున్నాడు.ఇప్పటికైనా మనం కళ్లు తెరిచి మనకంటూ కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసుకోకపోతే నిజంగా అది మన దేశానికి అవమానకరం’ అంటూ కామెంట్‌ చేసాడు.

అయితే దన్యాల్‌ గిలానీ అనే ఒక పాకిస్తానీ అధికారి ఈ వీడియోలో అడుక్కుంటున్న వ్యక్తికి సంబంధించిన వివరాలను పోస్టు చేసాడు.‘దోహా షిరాజ్‌ విమానంలో అడుక్కుంటున్న వ్యక్తి పాకిస్తానీ కాదు.

అతను ఒక ఇరానియన్‌.అతను మాట్లాడుతున్న భాషా పార్సీ.

అతన్ని ఉన్న పళంగా దేశం నుంచి తరలించారు.దాంతో చేతిలో చిల్లగవ్వ కూడా లేకపోవడంతో ఆ వ్యక్తి తన తోటి ప్రయాణికులను అడుక్కుంటున్నాడు’ అని పోస్టు చేసాడు.దోహా నుంచి షిరాజ్ వరకు ఖతార్ ఎయిర్వేస్ విమాన టిక్కెట్ ధర 2,000 - 3,000 ఖతారీ రియాల్స్‌(రూ.55,875) వరకూ ఖర్చవుతుంది.

తాజా వార్తలు