5 కే భోజనం పథకం... ఒడిస్సాలోనూ...!

ఏపీ తెలంగాణల్లో అమలవుతున్న 5 రూపాయలకే భోజన పథకం ను పోలిన మరో పధకాన్ని పక్క రాష్ట్రమైన ఒడిస్సాలోనూ.

అమలు చేసేందుకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ శ్రీకారం చుట్టారు.

కొత్త సంవత్సరం సందర్భంగా.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆసుపత్రుల సమీపంలో నైట్ మీల్ క్యాంటీన్స్‌ను నవీన్ పట్నాయక్ ప్రారంభించారు.

ఒడిశా రాష్ట్రంలో ఇలాంటి 54 ఆహార్ సెంటర్స్‌ను ప్రారంభించారు.

ప్రతీరోజూ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఈ క్యాంటీన్స్‌లో భోజనం అందుబాటులో ఉంటుంది.ఈ పథకాన్ని కొనసాగించడానికి ఆన్‌లైన్‌లో విరాళాలు చెల్లించవచ్చని ప్రజలకు ప్రభుత్వం తెలిపింది.ప్రజలు స్వచ్ఛందంగా చెల్లించే ఈ విరాళాలకు పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Advertisement
వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన
Advertisement

తాజా వార్తలు