అతడు చేసిన పనికి రూ.42 వేలు ఫైన్, అసలు ఏం చేసాడంటే ...!

చాలా దేశాల్లో బహిరంగ ఉమ్మేస్తే అది ఓ నేరం, అది అందరికీ తెలిసిన విషయమే.

కాకపోతే కడుపు నుంచి తెలియకుండానే బయటకు వచ్చే ఆపాన వాయువును వదిలిన నేరమా.? అంటే అవుననే ఆ దేశంలో అంటున్నారు.కాకపోతే చట్టప్రకారం అందుకు జరిమానా లేదు.

ఇకపోతే అక్కడ జరిగిన సంఘటన ఆధారంగా పోలీసులు అతడికి ఫైన్ విధించాల్సి వచ్చింది.ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా.?

అసలు విషయంలోకి వెళితే.ఆస్ట్రేలియా దేశంలో వియన్నాలో పోలీసులు రోడ్డు పై నడుస్తూ ఉండగా ఓ వ్యక్తి పార్క్ బెంచ్ మీద కూర్చొని అటుగా వెళుతున్న పోలీసులు వంక చూస్తూ వెకిలిగా నవ్వుతూ తన కడుపులోని గ్యాస్ ను బయటకు వదిలాడు. ఇక అంతే ఆ పోలీసులకు ఆ వాసన భరించలేని విధంగా వారికీ చేరుకుంది.

దీంతో సదరు పోలీసులు అతనిని పట్టుకొని క్షమాపణ చెప్పాలని అతడిని కోరారు.

Advertisement

అయితే అందుకు అతడు అంగీకరించకపోగా పోలీసులపై తిరగబడ్డాడు.ఈ సంఘటనతో ఆగ్రహించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.పబ్లిక్ ప్రదేశంలో పోలీసులతో అసభ్య కరంగా అమర్యాదగా ప్రవర్తించినందుకు అతనికి 505 యూరోలు అంటే మన దేశంలో రూ.42000 విధించారు.ఇకపోతే ఈ సంఘటనపై ఆ దేశ ప్రజలు మండిపడుతున్నారు.

ఇలాంటి చిన్న తప్పులకు కూడా ఇంత భారీ మొత్తంలో ఫైన్ విధిస్తారా అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు.అయితే మరి కొందరు మంచిపని చేశారంటూ అతనికి బుద్ధి వచ్చేలా చెప్పారని కొందరు కామెంట్ పెట్టారు.

Advertisement

తాజా వార్తలు