ఒకడే నిర్మాత, 35 హీరోయిన్ల లైంగిక వేధింపుల ఆరోపణ

మీరు హాలివుడ్ సినిమాల వార్తలు రెగ్యులర్ గా చదివే వారు అయితే హార్వే వెయిన్ స్టెయిన్ ఎవరు అనేది కొత్తగా చెప్పనక్కరలేదు.

ఎందుకంటే ఓ వారం పది రోజుల నుంచి ఏ హాలివుడ్ వెబ్ సైట్ చూసిన ఈ మహానుభావుడి పేరే వినబడుతోంది.

ఇతను ఎవరు? ఇదేగా మీ సందేహం.సినిమా హీరో కాదులెండి.

నిర్మాతగా ఓ డజను సినిమాలు నిర్మించాడు.ఇక ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గానైతే 70 సినిమాలకు పైగానే పనిచేసాడు.

నిర్మాత అయినా రోజూ సెట్స్ కి వెళ్ళడు కాని ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ అయితే ప్రతిరోజూ సెట్స్ మీద ఉండాల్సిందే కదా.ఈయన కామం ఎక్కువ అంట.అంతా ఇంతా కాదు.సెట్స్ మీద హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తించడం, అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా చేతులు వేయడం ఈయనకు ఓ కామన్ విషయం.

Advertisement

పేరుకి ఏమో పెద్దమనిషి.ఎందుకు దీన్ని బయటి లాగడం అని ఊరుకున్నారు.

కాని ఈమధ్య ఆయన ఆగడాలు మరీ హద్దు మీరిపోయేసరికి, హాలివుడ్ హీరోయిన్లంతా ఒకేసారి కట్టగట్టుకొని ఆయనగారి చేష్టలు బయటపెట్టడం మొదలుపెట్టారు.ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 35 మంది హీరోయిన్లు హార్వే మీద గత అయిదారు రోజుల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు.

అందులో ఎంజిలీనా జోలి, ఈవా గ్రీన్ లాంటి అగ్రహీరోయిన్లు కూడా ఉంటడం విడ్డూరం.ఎంతైనా, స్టార్స్ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు అనుకుంటాం కాని, స్టార్స్ తో కూడా అలానే ప్రవర్తించేవాడు అంటే అర్థం చేసుకోండి ఈ నిర్మాత ఎంతటివాడో, ఎలాంటివాడో.

మరోవైపు ఆ నిర్మాత ఇన్నేసి ఆరోపణలు ఉన్నా లొంగడం లేదు.అందరు ముందే ప్లాన్ చేసుకొని అబద్ధాలు ఆడుతున్నారని, అందరి మీద పరువు నష్టం కేసులు పెడతానని అంటున్నాడు.

Advertisement