నమో వెంకటేశాయా...అప్పుడే బిజినెస్...???

నాగార్జున ఎప్పుడు లేనంత ఫేమ్ లో ఉన్నాడు.నాగ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మేజిక్ చేస్తున్నాయి.

నాగ్ సినిమాలు మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించాయి.సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా అయితే 50 కోట్ల వసూళ్లను రాబట్టి కింగ్ రేంజ్ ని పెంచేసింది.

ప్రస్తుతం హ్యాట్రిక్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ నమో వెంకటేశాయా సినిమాలో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా సగం అయ్యిపోయింది.

అలాగే చిత్ర యూనిట్ విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతేకాక నమో వెంకటేశాయా సినిమా అప్పుడే 30 కోట్ల బిజినెస్ చేసేసిందట.

Advertisement

ఇదే కనుక నిజమైతే నాగార్జున రేంజ్ పెరిగినట్టే.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యజైస్వల్‌, విమలా రామన్‌ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో శ్రీనివాసుడిగా బాలీవుడ్‌ సీరియల్‌ ఆర్టిస్ట్‌ సౌరభ్‌ రాజ్‌ నటిస్తున్నాడు.ఈ సినిమాను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలనీ భావిస్తున్నారు.

Advertisement