2022, 2023 సంవత్సరాలలో భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలివే.. నష్టం ఎంతంటే?

పెద్ద సినిమాల ద్వారా నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలు వస్తాయో కొన్నిసార్లు అదే స్థాయిలో నష్టాలు కూడా వస్తాయి.

భారీ బడ్జెట్ తో పెద్ద సినిమాలను నిర్మించే నిర్మాతలు ఏ మాత్రం అశ్రద్ధతో వ్యవహరించినా వచ్చే నష్టాలు భారీ రేంజ్ లో ఉంటాయి.

గతేడాది, ఈ ఏడాది కొన్ని సినిమాలు నిర్మాతలకు భారీ షాకివ్వగా ఈ సినిమాల నష్టాల గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత షాకవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.పెద్ద హీరోలు తమ మార్కెట్ ను మించి ఖర్చు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఆచార్య( Acharya ) సినిమాకు 140 కోట్ల రూపాయలు ఖర్చైతే ఆ సినిమాకు కేవలం 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లు వచ్చాయి.శాకుంతలం ( Sakunthalam )సినిమాకు 80 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు 6 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

లైగర్( Liger ) సినిమా ఖర్చు 140 కోట్ల రూపాయలు కాగా ఆ సినిమాకు 35 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

Advertisement

రావణాసుర( Ravanasura ) సినిమా ఖర్చు 60 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.ఏజెంట్ ( agent )సినిమా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా కేవలం 12 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.అయితే శాటిలైట్, డిజిటల్ హక్కుల వల్ల నిర్మాతలకు కొంతమేర నష్టాలు వచ్చాయి.

సినిమాలకు ఫ్లాప్ టాక్ వస్తే నిర్మాతలు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది.ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం పెద్ద సినిమాల నిర్మాతలకు సైతం షాక్ తప్పదని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద సినిమాల నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని స్టార్ హీరోలు సినిమాల ఖర్చును తగ్గిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.స్టార్ హీరోలు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు