పాకిస్తాన్ లో ఘోరం మంచు తుఫాన్ బీభత్సం పదిమంది మృతి..!!

పాకిస్తాన్ ( Pakistan )దేశం ప్రకృతి విలయానికి విలవిలలాడుతోంది.తాజాగా ఆ దేశంలో మంచు తుఫాన్( Snow Storm ) బీభత్సం సృష్టిస్తోంది.

భారీగా హిమపాతం( snowfall ) కురుస్తోంది.మంచు వర్షం దాటికి రోడ్లు, చెట్లు, ఇల్లు.

అన్ని మంచులో కూరుకుపోయాయి.హిల్ ప్రాంతం ముర్రెలో దట్టమైన మంచు కురుస్తూ ఉండటంతో పలు వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి.

ఈ క్రమంలో కొంతమంది పర్యాటకులు ఇటీవల కారులో చిక్కుకుపోయి మరణించడం జరిగింది.

Advertisement

మంచు అందాలను వీక్షించేందుకు సొంత వాహనాలలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు కొండ ప్రాంతాల్లోకి వెళ్లి చిక్కుకుపోయి.పేరుకుపోయిన మంచు కుప్పలో బయటకు రాలేక చాలా మంది చనిపోతున్నారు.ఆ ఘటన మరువకముందే తాజాగా మరో 10 మంది మరణించినట్లు( 10 members Dead ) అధికారులు తెలియజేశారు.

ఇదే సమయంలో మరో 10 మంది గాయపడినట్లు పిఓకే నుంచి 35 మంది సంచార జాతుల వారు వలస వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడించారు.ఇదే సమయంలో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023
Advertisement

తాజా వార్తలు