భర్తకి షాక్ ఇచ్చిన తల్లీ కూతుళ్ళు.. తల్లీ కూతురుకి షాక్ ఇచ్చిన పోలీసులు

ఈ స్టొరీ లో మామూలు ట్విస్ట్ లు వింటుంటే మామూలు షాకులు తగలవు.ఒకరిని మించిన ఒకరి నటనకి పోలీసులకి దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది.

వివరాలలోకి వెళ్తే.పెందుర్తి లో నివాసం ఉంటున్నడాక్టర్ ఉమాకుమార్‌ శంకర్రావు కుటుంభం ఈ నెల 2వ తేదీ సాయంత్రం బయటకు వెళ్ళారు అయితే వీరు బయటకి వెళ్ళిన సమయంలో చోరీ జరిగింది ఈ విషయం తెలిసి ఇంటికి వచ్చిన శంకర్రావు పడకగదిలో సామగ్రి చిందరవందరగా పడి బీరువా లో ఉన్న డబ్బు బంగారం పోవడాన్ని గమనించి పోలీసులకి ఫిర్యాదు చేశారు.

Daughter And Mother Theft In Own House

మేము లేని సమయంలో దొంగలు మా ఇంటికి వచ్చి 70 తులాల బంగారం, 1400 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రూ.5.40 లక్షల నగదు పోయాయని తెలిపారు.అయితే చోరీ చేసిన దొంగలకి దొంగతం కొత్త ఏమో కానీ పోలీసులకి దొంగలని పట్టుకోవడం కొత్త కాదు కదా దాంతో మొదట్లోనే చోరీ తీరుపై అనుమానం వ్యక్తం చేశారు.

ఎలాంటి విధ్వంసం లేకుండా జరిగిన ఈ చోరీ తీరు తెలిసిన వారి పనే అని పసిగట్టారు.దాంతో దొంగతనం జరిగిందని ముందుగా చెప్పిన ఓనర్ కుమార్తెపై వారిని అనుమానం వచ్చింది శంకర్రావు కుమార్తె లిఖితను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె అడ్డంగా దొరికిపోయింది.

Advertisement
Daughter And Mother Theft In Own House-భర్తకి షాక్ ఇచ�

పాత పెందుర్తికి చెందిన తన స్నేహితుడు రవికిరణ్‌ ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు ఈ నేరం చేసినట్లు ఆమె అంగీకారం తెలిపింది రోజులాగే తండ్రి శంకర్రావు సాయంత్రం ఆçస్పత్రికి వెళ్లగా తల్లి మహాలక్ష్మి పనిమీద బయటకు వెళ్లింది.తాను స్థానికంగా ఉన్న బంధువుల ఇంటికి వెళతానని చెప్పిన లిఖిత ఇంటిలోనే ఉండిపోయి రవిని పిలిపించుకుని బీరువాలోని 30 తులాల బంగారం, రూ.3,03,000 నగదును ఇచ్చి పంపింది.అయితే ఇకక్డ అసలు ట్విస్ట్ ఏమిటంటే.

దొంగతమ జరిగినట్టుగా మాయ చేసిన కూతురు తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది తల్లి రాగానే దొంగతనం జరిగినట్లు నమ్మించింది.అయితే ఆమె తల్లి మహాలక్ష్మి పోయిన సొత్తును అధికంగా చెబితే రికవరీ కూడా ఎక్కువగా వస్తుందన్న అత్యాశతో బీరువా లాకరులో మిగిలి ఉన్న దాదాపు 40 తులాల బంగారం, రూ.2,37,000 నగదు, 1,400 గ్రాముల వెండి ఆభరణాలను బంధువుల ఇంటికి పంపింది.అయితే ఈ విషయాలు ఏమి తెలియని ఆమె భర్త పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కేసుని చేదించిన పోలీసులు అసలు దొంగలు ఇంటిదొంగలు అని చెప్పడంతో శంకర్రావు షాక్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు