ఎగ్జిట్‌ పోల్స్‌పై జేడీ లక్ష్మి నారాయణ కామెంట్స్‌

ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెళ్లడించాడు.ఏపీలో పరిస్థితి అంతా కూడా అర్థం కాకుండా ఉంది.

కొన్ని మీడియా సంస్థలు జగన్‌ సీఎం అంటే కొందరు మాత్రం చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అంటున్నారు.అయితే అందరు కూడా జనసేనకు కనీసం రెండు మూడు సీట్లు కూడా వచ్చేది కష్టమే అంటూ తేల్చి పారేశారు.

Jd Comments On Exit Polls News-ఎగ్జిట్‌ పోల్స్‌�

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటీ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అయితే ఇప్పటి వరకు పెద్దగా మాట్లాడలేదు.

అయితే ఆ పార్టీకి చెందిన కీలక నేత, వైజాగ్‌ పార్లమెంటు అభ్యర్థి జేడీ లక్ష్మినారాయణ స్పందించాడు.ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చూసి కార్యకర్తలు నిరాశ చెందవద్దు.

Advertisement

ఫలితాలు పూర్తిగా వచ్చే వరకు ఎదురు చూడాలంటూ ఈ సందర్బంగా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చాడు.వైజాగ్‌లోని ఒక ఇఫ్తార్‌ వింధులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గెలిచినా ఓడినా కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జనాల మద్య ఉంటారని ఆయన చెప్పుకొచ్చాడు.

ఖచ్చితంగా జనసేనకు మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తును కూడా జనసేన బాగు చేస్తుందని ఈ సందర్బంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Advertisement

తాజా వార్తలు