జగన్ పాద యాత్రకి మీడియా హ్యాండ్..ఎందుకో తెలుసా

జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడని అనుకున్న సమయంలో.జగన్ రెడ్డి కి గుర్తుకు వచ్చింది మొదటిసారిగా మీడియానేనట.

పాదయాత్ర చేసే సమయంలో మీడియా కనుకా తనని పట్టించుకోక పొతే సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని జగమెరిగిన జగన్ కి తెలుసు కదా అందుకే మీడియాని ప్రసన్నం చేసుకోవడానికి మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాడట.అది కూడా లోటస్ పాండ్ లోనే.

NO Media Support Jaganmohan Reddy Padayatra 1-జగన్ పాద యాత�

అయితే ఇదే విషయంలో ఈనాడు అధినేత రామోజీరావుని కూడా కలిసి తన పాదయత్రకి మద్దతు ఇవ్వమని కోరడం అందరికీ తెలిసిన విషయమే.అయితేనే మీడియా మిత్రులతో జగన్ ముందుగానే మాట్లాడిన తరువాత పాదయాత్ర కవరేజ్ విషయంలో మీడియా నుంచీ కొండంత సపోర్ట్ వస్తుంది అని గంపెడు ఆశలు పెట్టుకున్నాడు.

ఏపీలో మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను ఆయ‌న 125 నియోజ‌క‌వ‌ర్గాల‌ను ముందుగా క‌వ‌ర్ చేయాల‌ని సంక‌ల్పించారు.ఈ పాద‌యాత్ర‌కు ఆయ‌న స‌ర్వం సిద్ధం చేసుకున్నారు.

Advertisement

మొదటి రోజు మీడియా మిత్రులు కొంత సపోర్ట్ చేసినా తరువాత నుంచీ మీడియాలో పాదయాత్రకి సంభందిచిన న్యూస్ రాకపోవడం జగన్ ని సాక్షి తప్ప మరే మీడియా కూడా కవర్ చేయకపోవడంతో జగన్ కి అసలు సినిమా అర్థం అయ్యిందట.ఏమి చేయాలో తోచని జగన్ తన అద్భుతమైన పంచ్ డైలాగులు సాక్షి లో తప్ప మరెక్కడా కనపడక పోవడంతో.

తనకున్న సోషల్ మీడియా ద్వారా భారీగా ప్రచారానికి పూనుకున్నాడట.అయితే ఒక ప్రతిపక్ష నేత ఇలా పాదయాత్ర చేస్తుంటే మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఆలోచిస్తే ఒక మీడియా ప్రతినిధి నుండీవచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు నిజమే మంచిది.కానీ ఎవరికోసం చేస్తున్నారు.

ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బందులు పడటం లేదు.ప్రభుత్వం నుంచీ అందవలసిన సౌకర్యాలు అందుతున్నాయి.

చర్మాన్ని సూపర్ వైట్ గా మార్చే బెస్ట్ రెమెడీ ఇది.. దీని ముందు ఖరీదైన క్రీములు కూడా దిగదుడుపే!

ఎక్కడో ఒక చోట తప్పులు దొర్లకుండా ఉండవు సో వాటిని పట్టుకుని సమస్యలు అంటూ యాత్రలు చేస్తే ప్రజలు నమ్మడంలేదు.అసలు ప్రజలే అడుగుతున్నారు జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు అని అంటూ బదులు ఇచ్చారు.

Advertisement

ప్రజలు చంద్రబాబు పాలనలో సంతృప్తిగా ఉంటే మేము జగన్ పాదయత్రని చూపిస్తూ ఏమని చెప్పాలి.ప్రజలు చూస్తేనే కదా మాకు రేటింగ్స్ పెరిగేవి అంటూ ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టారట.

అందుకే మీడియాలో ఎవ్వరు కూడా జగన్ కి సపోర్ట్ చేయడం లేదు అంటూ చెప్పకనే చెప్పారు.మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

మీడియా కనుకా జగన్ యాత్రకి సపోర్ట్ చేయకపోతే పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.

తాజా వార్తలు