చర్మ కాంతిని తగ్గించే బ్లాక్‌హెడ్స్‌ను ఎలా వ‌దిలించుకోవాలంటే?

బ్లాక్ ‌హెడ్స్ లేదా మృత‌క‌ణాలు‌.చాలా మందిని ఇబ్బంది పెట్టే చ‌ర్మ స‌మ‌స్య ఇది.

ఎంత తెల్ల‌గా, అందంగా ఉన్నా బ్లాక్ హెడ్స్ ఉంటే మాత్రం అంద‌హీనంగా క‌నిపిస్తుంటారు.ముఖ్యంగా అమ్మాయిలు చ‌ర్మ కాంతిని త‌గ్గించే ఈ బ్లాక్ హెడ్స్ కార‌ణంగా తెగ బాధ ప‌డుతుంటారు.

ఈ క్ర‌మంలోనే వాటిని వ‌దిలించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఎంతో ఖ‌ర్చు పెట్టి ర‌క‌ర‌కాల‌ క్రీములు కొనుగోలు చేసి.

Home Remedies For How To Get Rid Of Blackheads! Home Remedies, Blackheads, Lates

వినియోగిస్తుంటారు.అయిన‌ప్ప‌టికీ బ్లాక్ హెడ్స్ త‌గ్గ‌క‌పోతే ఆవేద‌న చెందుతారు.

అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఫాలో అయితే సులువుగా బ్లాక్ హెడ్స్‌ను తొలిగించుకోవ‌చ్చు.మ‌రి లేట్ చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

Advertisement

ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కొకొన‌ట్ ఆయిల్ మ‌రియు బ్రౌన్ షుగ‌ర్ వేసి క‌ల‌పాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో రుద్దుతూ అప్లై చేయాలి.

ప‌ది నిమిషాల పాటు ఆర‌నిచ్చి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల బ్లాక్ హెడ్స్ దూరం అవుతాయి.రెండొవ‌ది.

ఒక బౌల్ తీసుకుని అందులో గంధం పొడి, చిటికెడు ప‌సుపు మ‌రియు రోజ్ వాట‌ర్ వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్ర‌మాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 17, శుక్రవారం 2023

ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఇలా వారానికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.మూడొవ‌ది.

ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా గ్రీన్‌ టీ పొడి మ‌రియు తేనె వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని మృత‌క‌ణాలు ఉన్న చోటు అప్లై చేసి.

అర గంట పాటు ఆరిపోనివ్వాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేసినా.బ్లాక్ హెడ్స్ తొల‌గుతాయి.

తాజా వార్తలు