కాపు ఓట్లు చీల్చడమే ధ్యేయంగా ముద్రగడను ప్రయోగిస్తున్నారా?

ఇంతకాలం రాజకీయాలకు దూరంగా కేవలం కాపు రిజర్వేషన్లే కేంద్రంగా పనిచేస్తూ వచ్చిన కాపు కుల నాయకుడు ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల వైపు చూస్తున్నారు ఆయనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని గత కొన్ని సంవత్సరాలుగా చాలా పార్టీలు ప్రయత్నాలు చేశాయి .

ఈ దిశగా భాజపా( BJP ), జనసేన( Janasena ) గతంలో కూడా ఆయనతో అనేకసార్లు చర్చలు జరుపినట్లు అయితే ఆయన సున్నితంగా వాటిని తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి .అయితే ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నట్టుగా స్వయంగా ప్రజలకు బహిరంగ లేఖ రాశారు ఏ పార్టీలో చేరతారో తొందరలోనే తెలియజేస్తానని ఆ లేఖలో ప్రస్తావించారు

Mudragada Wil Consist From Ysrcp Mudragada Padmanabham, Ys Jagan, Ysrcp Kakinad

అయితే తెలుగుదేశం పార్టీతో ( Telugudesam Party ) ఆయనకున్న విభేదాల నేపద్యం లో ఆ పార్టీలో చేరటం అసాద్యం.జనసేన ఆయన సామాజిక వర్గానికి చెందిన పార్టీ అయినప్పటికీ తెలుగుదేశంతో సఖ్యత నెరుపుతూ ఉన్నందున ఆ పార్టీకి కూడా దూరం పాటించాలని ఆయన భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.తుని( Tuni ) రైలు సంఘటనలో ఆయనపై నమోదైన కేసులు విషయంలో తనను అరెస్టు చేసి తీహార్ జైలుకు కూడా తరలించాలని ప్రయత్నాలు కొంతమంది చేశారని దానికోసం హెలికాప్టర్ను కూడా సిద్ధంగా ఉంచుకున్నారని ఆయన పరోక్షంగా టిడిపిపై ఇటీవల వ్యాఖ్యలు చేశారు.

దాంతో ఆయన తెలుగుదేశంపై తీవ్రస్థాయి కోపంలో ఉన్నారని స్పష్టమవుతుంది.తద్వారా తెలుగుదేశానికి దానితో పొత్తు పెట్టుకోవాలనుకున్న జనసేనకు దూరం పాటిస్తారట .ఇక మిగిలిన పార్టీలైన భాజపా వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congras) లలో .ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని సెలెక్ట్ చేసుకుంటారని తెలుస్తుంది .జగన్తో మంచే అనుబంధం ఉండటం, తుని కేసు రైల్వే కోర్టు కొట్టివేయడం లో ప్రభుత్వం కీలకం గా వ్యవహరించడం తో ఆయన ఆ పార్టీ పట్ల సానుకూలం గా ఉన్నారట .

Mudragada Wil Consist From Ysrcp Mudragada Padmanabham, Ys Jagan, Ysrcp Kakinad

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జనసేనకు చెక్ పెట్టాలంటే కాపు సామాజిక వర్గం ఓట్లను చీల్చాల్సిన అవసరం ఉందని భావిస్తుంది.కాపులలో విశ్వసనీయత ఉన్న ముద్రగడ లాంటి నాయకుడి ద్వారానే అది సాధ్యమవుతుందని ,ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కోరికలన్నీ తీర్చు మరి ఆయనను పార్టీలోకి ఆహ్వానించాలని తద్వారా కాపు సామాజిక వర్గం లో కొంత ఓట్ బ్యాంకు ( Vote Bank ) ను తమ పార్టీకి మళ్ళించుకోవచ్చని ఆ పార్టీ లెక్కలు వేసుకున్నట్లుగా తెలుస్తుంది.మరి వైసిపి కోరుకుంటున్నట్లుగా ముద్రగడ కాపు సామాజిక వర్గ ఓట్లనుచీల్చగలరో లేదో మరి కొంత కాలానికి ఒక క్లారిటీ వస్తుంది .

Advertisement
Mudragada Wil Consist From YSRCP? Mudragada Padmanabham, Ys Jagan, YSRCP Kakinad
మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!

తాజా వార్తలు