రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం తాడువాయి స్టేజి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.

మునగాల మండల కేంద్రానికి చెందిన మెడికల్ షాప్ యజమాని రాంబాబు(55)తన ద్విచక్ర వాహనంపై వ్యవసాయ పనుల నిమిత్తం కలకోవ గ్రామానికి వెళ్లి మునగాలకు వస్తుండగా 65వ జాతీయ రహదారిపై తాడువాయి వద్దకు రాగానే వెనక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని స్థానికుల సహాయంతో పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

One Died On The Spot In A Road Accident , Road Accident , One Died , Rambabu-�
అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?

Latest Suryapet News