వావ్: ఇకపై ఆ ప్రాంతాల్లో డ్రోన్లతో సరుకులు రవాణా..!

నేటి టెక్నాలజీ యుగంలో డ్రోన్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.లాజిస్టిక్స్ రంగం నూతన ఒరవడితో దూసుకెళ్తోంది.

 Zypp Electric To Add Drones For Last Mile Delivery In These Cities, Drones, Zypp-TeluguStop.com

ప్రస్తుతం ఈ కామర్స్ కంపెనీలు కూడా తమ కస్టమర్లకు డెలివరీ సేవలను మరింత వేగంగా అందించేందుకు పోటీపడుతున్నాయి.అందులో భాగంగా ఇప్పుడు దేశంలోని 5 నగరాల్లో డ్రోన్లను సరుకుల రవాణాకు వినియోగించనున్నారు.

ఆ విధానం త్వరలోనే ప్రారంభం కానుంది.ప్రస్తుతం డ్రోన్ లాజిస్టిక్స్ రంగంలో వెళ్లినట్లుగా లాస్ట్-మైల్ డెలివరీ సర్వీస్‌ను నడుపుతున్నట్లుగా జిప్ ఎలక్ట్రిక్ కంపెనీ వెల్లడించింది.

అందులో భాగంగా టీఎస్ఏడబ్ల్యుతో అగ్రిమెంటు కూడా చేసుకుంది.మొదటి సారి నాలుగు నగరాల్లో 200 డ్రోన్లను సరుకుల రవాణాకు వినియోగించనున్నారు.

ఈ సర్వీసులను మొదటగా ఢిల్లీ ఎన్‌సిఆర్, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణేలలో మొదలు పెట్టనున్నారు.అన్ని డ్రోన్లలో స్మార్ట్ లాకర్లు అమర్చుతారు.

అవి కస్టమర్‌కు ఇచ్చిన ఓటీపీతో ఆ లాకర్లు తెరుచుకుని సరుకులు ఇవ్వనున్నాయి.

Telugu Delivery, Goods Delivery, Zypp Electric-Latest News - Telugu

ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద సిటీల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.వీటి వల్ల చాలా ప్రదేశాలకు సరుకులు త్వరగా రవాణా చేయలేరు.ఈ కారణంగా అనేక ప్రాంతాల్లో లాస్ట్ మైల్ డెలివరీ సేవలు ఆలస్యం అవుతున్నాయి.

అతి ముఖ్యమైన అత్యవసరమైన ఆహారం, మందులు, కిరాణా సామాగ్రిని వీలైనంత త్వరగా వినియోగదారులకు చేర్చాలనే ఉద్దేశంతో ఈ కామర్స్ సంస్థలు ఇటువంటి సర్వీసులను ప్రారంభించనున్నాయి.జిప్ ఎలక్ట్రిక్ సంస్థ కోఫౌండర్ అయిన ఆకాష్ గుప్తా ఈ సర్వీసుల గురించి వివరించారు.

కస్టమర్లకు డెలివరీ అతి త్వరగా చేయాలనే ఉద్దేశంతో తాము ఇటువంటి సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.ఈ డ్రోన్ల సాయంతో అతి తక్కువ టైంలోనే చాలా దూర ప్రదేశాలకు సరుకులను రవాణా చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

నిత్యావసర సరుకులను, మందులను, ఆహార పదార్థాలను అతి త్వరలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.అలా చేయడం వల్ల వారికి కనీసం 10 రెట్లు టైమ్ కలిసొస్తుందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube