అమెరికా మార్కెట్ లోకి ఇండియా ఔషధం  

Zydus Receives Final Nod From Usfda To Market Acetazolamide-drug Firm Zydus Cadila,usfda,జైడుస్‌ కాడిలా

ఇండియాలో డ్రగ్స్ కంపెనీలలో తయారయ్యే చాలా రకాల మందులు అమెరికా మార్కెట్ లో సైతం విడుదలఅయ్యి అక్కడ ఆదరణ పొందిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా మరొక డ్రగ్ కంపెనీకి చెందిన ఓ ఔషదం అమెరికాలో అన్ని రకాల అనుమతులు పొంది అమెరికా మార్కెట్ లోకి వెళ్ళడానికి సిద్దంగా ఉంది..

అమెరికా మార్కెట్ లోకి ఇండియా ఔషధం-Zydus Receives Final Nod From USFDA To Market Acetazolamide

ఇండియాకి చెందిన ఔషధ కంపెనీ జైడుస్‌ కాడిలా తాను తయారుచేసిన జనరిక్ అసెటజోలమైడ్‌ ఇంజెక్షన్‌ను అమెరికా మార్కెట్ లోకి విడుదల చేయడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ నుంచి తుది ఆమోదం పొందిందని జైడుస్ తెలిపింది.

500 ఎంజీ ఇంజక్షన్ ఇవ్వడానికి ఉద్దేశించిన అసెటజోలమైడ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయడానికి యుఎస్‌ఎఫ్‌డీఏ నుంచీ తుది అనుమతులు పొందింది.

ఈ విషయాన్ని తుది అనుమతి లభించిందని బొంబాయి స్టాక్‌ ఎక్స్చేంజ్‌ కి ఇచ్చిన ఓ పత్రంలో పేర్కొంది. ఈ ఔషధం అహ్మదాబాద్ లో మొరాయియా వద్ద గల జైడుస్‌ కాడిలా గ్రూప్‌ ఫార్ములేషన్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ కేంద్రంలో తయారవుతుంది.