వావ్‌.. జన్‌పల్స్‌ డోర్‌ బెల్‌ పనితీరు అద్భుతం!

సాధారణంగా ఇంటికి భద్రతను కల్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం.అందులో భాగంగా సీసీ కెమెరాల వంటివి అమరుస్తాం.

 Zunpulse Door Bell Is An Extra Layer For House-TeluguStop.com

అయితే, ఈ మధ్య కాలంలో వస్తున్న డోర్‌ బెల్స్‌ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలో జన్‌పల్స్‌ స్మార్ట్‌ డోర్‌బెల్‌ వచ్చింది.

దీని పనితీరు వివరాలు తెలుసుకుందాం.పూర్వరోజుల్లో మాదిరిగా అందరినీ ఇంట్లోకి ఆహ్వానించలేని పరిస్థితి ప్రస్తుతం.

 Zunpulse Door Bell Is An Extra Layer For House-వావ్‌.. జన్‌పల్స్‌ డోర్‌ బెల్‌ పనితీరు అద్భుతం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎవరైన వచ్చినా ఇంటి డోర్‌ వద్దే మాట్లాడి పంపించేస్తాం.అందుకే ప్రస్తుత రోజుల్లో ఈ జన్‌పల్స్‌ వంటి డోర్‌ బెల్స్‌ చాలా ఉపయోగపడుతుంది.

ఈ డోర్‌ బెల్‌ను చాలా సులభంగా వాడచ్చు.దీన్ని ప్రధాన డోర్‌తోపాటు అన్నీ ఇతర డోర్లకు అమర్చుకోవచ్చు.దీన్ని మన స్మార్ట్‌ ఫోన్‌తో కనెక్ట్‌ చేసుకోవచ్చు.అంటే జన్‌ప్లస్‌ యాప్‌ ఉంటుంది.

దీన్ని డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది.వైఫై ద్వారా ఇది నియంత్రణలో ఉంటుంది.

కంపెనీకి చెందిన ఇతర ఓటీటీ డివైజ్‌లతో కూడా దీన్ని కంట్రోల్‌ చేయవచ్చు.ఈ డోర్‌ బెల్‌కు ముందు భాగంలో ఓ కెమెరా కన్ను ఉంటుంది.ఇది చీకటి సమయంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది.సెన్సార్‌ మోషన్‌తో పనిచేస్తుంది.దీనిపై ఉండే బటన్‌ను విజిటర్స్‌ ప్రెస్‌ చేసే వీలు ఉంటుంది.ఈ డోర్‌ బెల్‌కు ఇంట్లోని ఏదైన పవర్‌ సాకెట్‌తో కలిపి ఓ ప్లగ్‌ ఉంటుంది.

ఈ బటన్‌ ఎవరైనా ప్రెస్‌ చేస్తే అది రింగ్‌ అవుతూ ఉంటుంది.అసలు ఎవరైనా ఇంటి డోర్‌ సమీపంలోకి వస్తేనే ఈ డోర్‌బెల్‌ మనల్ని అలర్ట్‌ చేస్తుంది.

దీనికి ఉన్న అద్భుత ఫీచర్‌ ఇది.

Telugu App Downlod, Door Bell, Doors, Doors Main Door, For Visitors, Jun Pulse, Main Door, Security, Security App, Sensors, Working With Sesors-Latest News - Telugu

ఎవరైనా వచ్చి డోర్‌ బెల్‌ కొడితేనే తెలిసే అవసరం లేదు.వారి సెన్సర్‌ మోషన్‌తోనే ఇది పనిచేస్తుంది.యాప్‌లో ఉండే 0 ను క్లిక్‌ చే స్తే ఫోన్‌లోనే డోర్‌ వద్ద ఎవరున్నారో కనిపిస్తుంది.

ఈ యాప్‌తోనే వచ్చిన వ్యక్తికి కూడా మెసేజ్‌ ద్వారా చెప్పొచ్చు.అంటే ఏదైనా డెలివరీ ప్యాకేజీ వస్తే డోర్‌ వద్దే వదిలేసి వెళ్లమని చెప్పొచ్చు.ఈ కెమెరా వైడ్‌ యాంగెల్‌ను చూపిస్తుంది.అంటే ఎవరూ ఆ కెమెరాను తప్పించుకొనే ప్రయత్నం చేయలేరు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ కెమెరా పనితీరు అందరికీ అవసరం.ఒకవేళ ఎప్పుడైన చిన్నపిల్లల్ని, వయస్సు మళ్లినవారిని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళితే కూడా మీ స్మార్ట్‌ ఫోన్‌తోనే డోర్‌ను ఆపరేట్‌ చేయవచ్చు.

ఈ డోర్‌బెల్‌ అంత అద్భుతంగా పనిచేస్తుంది.ఈ డోర్‌బెల్‌కు బ్యాటరీ ఉంటుంది.

ఇది చాలా తక్కువ పవర్‌ ఖర్చుతో కూడింది.కొన్ని రోజుల వరకు అయితే అద్భుతంగా పనిచేస్తుంది.

దీంట్లో 32 జీబీ వరకు మెమొరీ కార్డును కూడా అమర్చుకోవచ్చు.దీని ధర రూ.6,990తో ఈ స్మార్ట్‌ డోర్‌ బెల్‌ను పొందవచ్చు.ఎవరికైతే తమ ఇంటికి అదనపు భద్రత అవసరమో వారి ఇంటికి ఈ డోర్‌ బెల్‌ తప్పనిసరి.

#Downlod #Door Bell #Security #Visitors #Doors Door

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు