జుకర్ బర్గ్ కి మెరుపులాంటి ఆలోచన ! ఈ అన్ని యాప్స్ ని కలిపి ....?

ఇప్పుడు నుంచి పెద్ద వారి వరకు అంతా… సోషల్ మీడియా కు బానిసలే.అన్నం అయినా తినకుండా ఉండగలుగుతారేమో కానీ సోషల్ మీడియా చూడకుండా ఎవరికీ నిద్ర పట్టదు… తెల్లారదు అన్నట్టుగా ఉంది పరిస్థితి.ఆయా… సోషల్ మీడియా నెట్వర్క్ లు కూడా ఎవరికి వారే ఆధిపత్యం తమదే అన్నట్టుగా… చలామణి అవుతున్నారు.సరిగ్గా ఈ సమయంలోనే … ఫేస్ బుక్ ఇంక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కి ఒక మెరుపులాంటి ఐడియా వచ్చింది.

అదేంటి అంటే… ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసేంజర్ సర్వీసులన్నిటినీ కలిపి ఒకేవిధంగా చేసే ఆలోచనలో ఉన్నట్టు శుక్రవారం న్యూయార్క్ టైమ్ తెలిపింది.ఈ యాప్స్ అన్నిటిని కలిపి ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ పొందుపరిచే ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు చెప్పింది.

అయితే ఈ మూడు సర్వీసులు ఇప్పుడు ఉన్నట్టుగానే వేర్వేరు యాప్స్ గా కొనసాగుతాయని వెల్లడించింది.

అయితే ఇది ఈ ఏడాది చివరి కల్లా లేదా 2020 ఆరంభం నాటికి పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.అయితే ఈ వార్తపై ఫేస్ బుక్ మాత్రం స్పందించలేదు.మార్పుల తర్వాత ఒక ఫేస్ బుక్ యూజర్, ఉదాహరణకు వాట్సాప్ అకౌంట్ మాత్రమే ఉన్న వేరే యూజర్ కు ఎన్ క్రిప్టెడ్ మెసేజ్ పంపవచ్చు.

మెసేజ్ పంపినవారు, పొందినవారు తప్ప మిగతావారెవరూ చూడకుండా ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ రక్షణ కల్పించేలా రక్షణ చర్యలు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube