ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల కౌంటింగ్ విషయం కి సంబంధించి హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వడం జరిగింది.జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.అప్పట్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి .సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించలేదని ఎన్నికల రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది మే 21 వ తారీకున తీర్పు ఇవ్వడం తెలిసిందే.

దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఎన్నికల కమిషనర్ తో పాటు ఎన్నికలలో పోటీ చేసిన కొందరు హైకోర్టు డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేయడం జరిగింది.ఈ క్రమంలో వాటి పై విచారణ జరిపిన హైకోర్టు… ఆగస్టు 5వ తారీఖున తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది.ఇటువంటి తరుణంలో తాజాగా నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గో స్వామి, జస్టిస్ ఉమాదేవి తో కూడిన ధర్మాసనం ఎన్నికల కౌంటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది.