విద్యార్థులు, ఉద్యోగుల కోసం సరికొత్త ఫీచర్ తో "జూమ్"

లాక్‌డౌన్ నేపథ్యంలో మీటింగులకు, ఆన్‌లైన్ క్లాసులకు జూమ్ వీడియో కాలింగ్‌ను అందరూ విరివిగా ఉపయోగిస్తున్నారు.అయితే భద్రత విషయంలో ఈ యాప్ అంత పనితీరును కనబరచక పోవడంతో వివిధ దేశాలు ఈ యాప్ వాడకాన్ని నిషేధించాయి.

 zoom With The Newest Feature For Students And Employees, Zoom, New Feature, Jobe-TeluguStop.com

అదే బాటలో భారత ప్రభుత్వం కూడా జూమ్ యాప్ వాడకం మీద పరిమితులతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది.ముఖ్యంగా వ్యక్తిగత అవసరాల కోసం జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ వాడకాన్ని తగ్గించాలని కేంద్ర హోం శాఖ కోరింది.

ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలనుకునే వారికి కొన్ని సూచనలు జారీ చేసింది.లాక్‌డౌన్ సమయంలో పెరుగుతున్న సైబర్ దాడులను అరికట్టే నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జూమ్ యాజమాన్యం యూజర్లను దృష్టిలో పెట్టుకుని పలు ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.ఇప్పుడు జూమ్ ఇమ్మర్సివ్ వ్యూ అని పేరుతో అదిరిపోయే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

గతంలో జూమ్ నుంచి వీడియో కాల్ చేసినప్పుడు మన బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంటే అలా కనబడేది.

ఇప్పుడు జూమ్ తీసుకొచ్చిన ఇమ్మర్సివ్ వ్యూ అనే ఫీచర్‌ సహాయంతో ఉద్యోగులు అయితే నిజంగానే మనం ఆఫీసులో ఉన్నామా, విద్యార్థులు అయితే పాఠశాలలో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది.

జూమ్ గత సంవత్సరం తన జూమ్ టోపియా పేరుతో ఈ ఫీచర్‌ను ప్రకటించింది.జూమ్‌ ఇమ్మర్సివ్ వ్యూ పేరుతో నిర్వహించే సమావేశంలో 25 మందికి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ విదేశాల్లో ఉన్న ఉచిత, ప్రో వినియోగదారులకు అందుబాటులో ఉంది.ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఒక గదిలో ఐదారు స్థానాలు కనిపిస్తాయి.అందులో టేబుల్‌ దగ్గర(పైన ఒకటో ఫొటోలో ఉన్నట్లు) సమావేశంలో కూర్చున్నట్లుగా అడ్జెస్ట్‌ చేయవచ్చు.అవసరమైతే బ్యాగ్రౌండ్‌ను కూడా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు.

అయితే దీనిలో ఎటువంటి మార్పులు చేయాలన్న కేవలం హోస్ట్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది.త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి తీసుకొనిరనున్నారు.

ఈ ఫీచర్‌ ప్రస్తుతానికి జూమ్‌ డెస్క్‌ టాప్‌ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.అయితే దీనికి పోటీగా ఇదే తరహా ఫీచర్‌ మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ ‘టుగెదర్‌ మోడ్‌’ పేరుతో అందుబాటులో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube