అధిరిపోయే ఆఫర్ ప్రకటించిన జూమ్.. ఏంటో తెలుసా?

‘థాంక్స్ గివింగ్’ రోజున వినియోగదారులను అధిరిపోయే ఆఫర్ ప్రకటించేసింది వీడియో కాలింగ్ యాప్ జూమ్.కరోనా కష్టకాలంలో అందరినీ చేరువచేసేందుకు జూమ్ ఒక్కసారిగా అందరికీ చేరువైంది.

 A New Offer Announcement From Zoom Company, Zoom, Thanks Giving, Corona, Time Li-TeluguStop.com

అయితే కరోనా వచ్చినప్పటినుంచి చాలా వరకు అందరూ ఇంట్లో నుంచే తమ వర్క్ ను చేస్తున్నారు.

చెప్పాలంటే విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసెస్ చూడటానికి, ఉద్యోగులు , రాజకీయ నాయకులు మీడియా సమావేశాలకు ఈ జూమ్ యాప్ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దీనితో ఈ యాప్ మరింత పాపులర్ అయింది.కాగా ఈ యాప్ ప్రస్తుతం వీడియో కాలింగ్ ఫెసిలిటీని 40 నిమిషాలకు పరిమితం చేసేసింది.

Telugu Zoom Company, Corona, Time Limit Zoom, Zoom-Latest News - Telugu

కాగా ఈ జూమ్ యాప్ తో పోలిస్తే మిగతా యాప్ లు టైం లిమిట్ ను ఎక్కువగానే ఇస్తున్నాయి.వీటిలో గూగుల్ మీట్ 60 నిమిషాలు, సిస్కో వెబ్ ఎక్స్ లో 50 నిమిషాల టైం కేటాయించారు.కాగా ‘థాంక్స్ గివింగ్’రోజున అంటే ఈ నెల 26 వ తేదీన అర్ధరాత్రి నుంచి 27 వ తేదీ ఉదయం 6 గంటల వరకు వీడియో కాలింగ్ పై ఉన్న ఆంక్షలన్నింటినీ ఎత్తేసింది.
బంపర్ ఆఫర్ ను అమెరికాలో థాంక్స్ గివింగ్ డే వేడుకల సందర్భంగా ఈ ఆఫర్ ను ప్రకటించినట్టు జూమ్ తెలిపింది.

వీడియో కాలింగ్ పై ఉన్న 40 నిమిషాల గడువును పూర్తిగా తొలగిస్తున్నట్టు జూమ్ అధికారికంగా ప్రకటించేసింది.దీనిని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు తెలిపింది.ఇంకేముంది మీరు కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుని మీకిష్టమైన వారితో టైం స్పెండ్ చేసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube