జూమ్ మీటింగ్‌లో నగ్నంగా కనిపించిన ఎంపీ...ఎక్కడంటే..?!

దేశంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.చాలా మంది ఉద్యోగులు వాళ్ళ ఇంట్లో నుంచి పని చేస్తూ ఉన్నారు.

 Zoom Metting Viral Photo Viral News Viral Mp Canadian Mp-TeluguStop.com

మరి రాజకీయ నేతలు కూడా ఇళ్ల కే పరిమితమై ముఖ్యమైన సమావేశాలు అన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు.వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించేందుకు  చాలా మంది జూమ్, గూగుల్ మీట్ లను ఉపయోగిస్తున్నారు.

అయితే ఈ క్రమంలో అనుకోని సంఘటనలు ఎన్నో చోటు చేసుకోవడం మనం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చూసాము.అయితే, తాజాగా కెనడాలో కూడా అచ్చం ఓ సంఘటన చోటు చేసుకుంది.

 Zoom Metting Viral Photo Viral News Viral Mp Canadian Mp-జూమ్ మీటింగ్‌లో నగ్నంగా కనిపించిన ఎంపీ…ఎక్కడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేశ ఎంపీ జూమ్ మీటింగ్ లో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఒక ఎంపీ నగ్నంగా దర్శనం ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.విలియమ్ ఆమోస్ హౌస్ ఆఫ్ కామన్స్‌ లో క్యూబెక్ డిస్ట్రిక్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుల అందరు కూడా  వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఆ సమయంలో విలియమ్ ఆమోస్ నగ్నంగా కన్పించాడు.

అంతేకాకుండా తన డెస్క్ వెనకాల కెనడా, క్యూబెక్ మధ్య ఆయన ఉన్నట్లు మనం ఫోటోలో గమనించవచ్చు. ఆ ఫోటో ని చూసిన హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుల అందరూ కూడా ఒక్క సారిగా షాక్ కి గురయ్యారు.

ఈ విషయాన్ని గమనించిన ఎంపీ విలియమ్ ఆమోస్ వెంటనే కెమెరా ఆఫ్ చేశాడు.అనంతరం దుస్తులు ధరించి సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్బంగా విలియమ్ ఆమోస్ మాట్లాడుతూ “అది దురదృష్టవశాత్తు జరిగిన పొరపాటని, జాగింగ్ కి వెళ్లి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుంటున్న సమయంలో అనుకోకుండా కెమెరా స్విచ్ ఆన్ అయిందని, ఇలా జరిగినందుకు సభ్యులందరికీ క్షమాపణలు చెప్తున్నట్లు” అయిన తెలిపారు.

#Canadian Mp #Viral Mp #Zoom Metting

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు