Zoom App వాడుక సురక్షితం కాదంటున్నకేంద్రహోంశాఖ

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.దీనితో చాలామంది ఇంటి నుంచే పని చేయడం మొదలు పెట్టి Zoom App ను ఉపయోగించి చాలా కంపెనీ లు ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకుంటున్నారు.

 Zoom App Video Conference Calls Not Safe-TeluguStop.com

అయితే ఈ విధంగా Zoom App లో వీడియో కాన్ఫరెన్స్ లను నిర్వహించడం అంత సురక్షితం కాదంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.కొన్ని సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఆ యాప్ లో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

అందుకే ఈ యాప్ ద్వారా కంపెనీ లు కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకోవడం అంత సురక్షితం కాదంటూ హెచ్చరించింది.ఇటీవల అమెరికాలో కొందరు ఉద్యోగులు ఇలాగే Zoom Appలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నప్పుడు కొన్ని శృంగార వీడియోలు తెరపై కనిపించాయి.

దీంతో వారంతా అవాక్కయ్యారు.దీనిపై అమెరికా ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయడం తో అక్కడి FBI దీనిపై విచారణ జరిపింది.

దీనిపై కంపెనీ నుంచి వివరణ కూడా కోరగా కొన్ని సెక్యూరిటీ సంబంధమైన సమస్యలు ఉన్నాయన్న విషయం అర్ధమైంది.ఈ క్రమంలో భారత ప్రభుత్వ హోంశాఖ కూడా Zoom యాప్ లో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించడం అంత సురక్షితం కాదంటూ ప్రజలను హెచ్చరిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube