వైరల్‌ : జూమ్‌యాప్‌లో క్లాస్‌లు చెబుతూ ఫీజు అడిగిన స్కూల్‌ వారికి ఒక తండ్రి ఇచ్చిన కౌంటర్‌ మామూలుగా లేదుగా

Zoom App Father Counter To School Fee

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ఎన్నో దేశాల్లో లాక్‌ డౌన్‌ అమలు అవుతుంది.మన దేశంలో లాక్‌డౌన్‌ గత 25 రోజులుగా అమలులో ఉన్న విషయం తెల్సిందే.

 Zoom App Father Counter To School Fee-TeluguStop.com

చాలా దేశాల్లో లాక్‌ డౌన్‌ అమలులో ఉన్న సమయంలో జూమ్‌ యాప్‌ ద్వారా ఆఫీస్‌ వర్క్‌ చేసుకుంటున్నారు.కాని ఇండియాలో మాత్రం స్కూల్‌ పిల్లలకు పాఠాలు కూడా జూమ్‌ యాప్‌ ద్వారా చెబుతున్నారు.

ఇండియాలో జూమ్‌ యాప్‌ వినియోగం గతంతో పోల్చితే 300 రెట్లు పెరిగినట్లుగా తెలుస్తోంది.జూమ్‌ యాప్‌లో పిల్లలకు పాఠాలు చెబుతున్నాం కదా అని కొందరు సార్లు ఫీజులు కూడా అడుగుతున్నారు.

 Zoom App Father Counter To School Fee-వైరల్‌ : జూమ్‌యాప్‌లో క్లాస్‌లు చెబుతూ ఫీజు అడిగిన స్కూల్‌ వారికి ఒక తండ్రి ఇచ్చిన కౌంటర్‌ మామూలుగా లేదుగా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఒక వాయిస్‌ క్లిప్‌ తెగ వైరల్‌ అవుతోంది.అది ఎక్కడ, ఏ స్కూల్‌, ఏ ప్రాంతంకు సంబంధించింది అనేది తెలియదు.కాని ఆ వాయిస్‌ మాత్రం తెలుగు వారందరు షేర్‌ చేస్తున్నారు.ఇంతకు ఆ రికార్డింగ్‌లో ఏముందంటే… ఒక కుర్రాడికి అతడి స్కూల్‌ నుండి టీచర్‌ కాల్‌ చేశారు.

జూమ్‌ యాప్‌లో క్లాస్‌లు జరుగుతున్నాయి వింటున్నావా అంటూ ప్రశ్నించాడు.అందుకు వింటున్నాను అంటూ సమాధానం చెప్పిన కుర్రాడికి హోం వర్క్‌ ఇచ్చాము చేశావా అనగా ఇంకా చూడలేదు చేస్తాను సర్‌ అన్నాడు.

అప్పుడు మీ నాన్న గారికి ఫోన్‌ ఇవ్వమంటే ఇచ్చాడు.

ఆ కుర్రాడి తండ్రి ఫోన్‌ తీసుకుని మాట్లాడుతూ ఉండగా సర్‌ మీరు మీ పిల్లల స్కూల్‌ ఫీజు బ్యాలన్స్‌ ఉంటే పే చేయాలంటూ చెప్పాడు.అప్పుడు ఆ తండ్రి ఈ సమయంలో మీరు ఫీజు ఎలా అడుగుతున్నారు.మిమ్ములను ఇలా ఆన్‌ లైన్‌ క్లాసులు ఎవరు చెప్పమన్నారు, ఇలా ఫీజులు ఎవరు అడగమన్నారు అంటూ ఒక రేంజ్‌లో ఏకిపారేశాడు.

నన్ను కాని అడిగారు పర్వాలేదు నేను చిన్నగా చెబుతున్నాను ఇలా ఇతరులను అడిగితే మిమ్ములను బండబూతులు తిడతారు.అసలే మందు దొరక్క తిక్క లేచిపోతూ ఉన్న వారికి మీరు ఫోన్‌ చేసి ఫీజ్‌ అడిగితే ఇక వారు మీకు బూతులతోనే సమాధానం చెబుతారు జాగ్రత్త అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

నేను ఇప్పుడు ఫీజు కట్టను ఏం చేసుకుంటారో చేసుకోండి.లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు ఎవరిని ఫీజు అడగకండి అంటూ హెచ్చరించాడు.

#Fees #Zoom #Lock #Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube