గాడిదకు రంగులేసి జీబ్రాగా మార్చిన వైనం...ఆఖరికి బయటపడ్డ నిజం..

ఏదో తెలుగు సినిమాలో జూ నుండి ఎలుగుబంటి తప్పించుకుని పోవడంతో మనిషికి ఎలుగుబంటి డ్రెస్ వేసి జూలో పెట్టి నిజంగానే ఎలుగుబంటి అన్నట్టు నమ్మించే ప్రయత్నం చేస్తారు.ఎలుగుబంటి గెటప్లో ఉన్న వ్యక్తి పడిన పాట్లు అన్ని ఇన్ని కావు.

 Zoo Paint A Donkey With Stripes To Make It Look Like A Zebra-TeluguStop.com

ఆ పాట్లు ,ఫీట్లు మనల్ని భలే నవ్వించాయి.ఇప్పుడు ఇదే తరహాలో ఈజిప్ట్ వాళ్లు గాడిదను జీబ్రా అని నమ్మించే ప్రయత్నం చేశారు.

ఈజిప్టు రాజధాని కాహిరాలోని ఒక జూలో ఈ వింతే జరుగుతోంది.ఇంటర్నేషనల్ గార్డెన్ మునిసిపల్ పార్క్‌లో ఒక గాడిదకు బ్లాక్ అండ్ వైట్ పెయింట్ వేసి,జీబ్రాగా మార్చేశారు.జూలో జంతువులను చూడ్డానికి వచ్చేవారికి దాన్ని జీబ్రాగా చూపిస్తున్నారు.అంతా బానే ఉంటే మనం ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్పుకుంటాం.అలా జూ చూడ్డానికి వచ్చిన ఒక విద్యార్ధి అది జీబ్రా కాదు గాడిదని కనిపెట్టేశాడు.మొహమూద్ అనే విద్యార్థి పార్కులో ఉన్న జీబ్రాను చూసి కంగుతిన్నాడు.

ఎందుకంటే జీబ్రా ఎలా ఉంటుందో అతనికి స్పష్టంగా తెలుసు.దీంతో అది జీబ్రాకాదని, గాడిద అని గ్రహించి… దాని ఫొటోను మొహమూద్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్టు చేశాడు.

జీబ్రాలా కనిపిస్తున్న ఆ గాడిదకు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.మా పార్క్ లో అలాంటిది ఏం జరగలేదంటూ ఆ జూ యాజమాన్యం నమ్మించే ప్రయత్నం చేస్తుంది.ఇంకా నయం గాడిద పోలికలతో పుట్టిన జీబ్రా …ప్రపంచంలో మరో వింత అంటూ ప్రచారం చేయట్లేదు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube