సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న జాంబీరెడ్డి  

Zombie Reddy Movie Release Postponed, Tollywood, Telugu Cinema, Teja Sajja, Prasanth Varma, Anandi, Sankranthi Festival - Telugu Anandi, Prasanth Varma, Sankranthi Festival, Teja Sajja, Telugu Cinema, Tollywood, Zombie Reddy Movie

సోలో బ్రతుకే సో బెటరు సినిమాతో లాక్ డౌన్ తర్వాత మరల థియేటర్స్ లో సినిమా పండగ స్టార్ట్ అయ్యింది.ఆ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

TeluguStop.com - Zombie Reddy Movie Release Postponed

ఇప్పుడు ఆ జోష్ ని మాస్ రాజా రవితేజ క్రాక్ సినిమా కొనసాగిస్తుంది.సంక్రాంతి రేసులో ముందుగా వచ్చిన ఈ సినిమాలో రవితేజ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి జనాలని థియేటర్స్ వైపు రప్పిస్తుంది.

ఇక సంక్రాంతి పండగ అంటే సినిమాల పండగ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఈ వేడుకకి కొనసాగింపుగా విజయ్ మాస్టర్ సినిమాతో పాటు, రామ్ రెడ్ మూవీ, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్సినిమాలు ఉన్నాయి.

TeluguStop.com - సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న జాంబీరెడ్డి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక వీటిపై కూడా మంచి పాజిటివ్ బజ్ ఉంది.హిట్ టాక్ సొంతం చేసుకునే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది.

ఈ నేపధ్యంలో ఈ సంక్రాంతి సినిమాలు ఫుల్ మీల్స్ పండగ భోజనంలా ఉండబోతున్నాయని మాటగట్టిగా వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సంక్రాంతి సందర్భంగా మొదటి తెలుగు జాంబియన్స్ మూవీ జాంబీ రెడ్డి రేస్ నుంచి తప్పుకుంది.

జాంబీ రెడ్డి సినిమా వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.ఇన్ని కమర్షియల్ సినిమాల మధ్యలో డిఫరెంట్ కథాంశంతో కరోనా ఎలిమెంట్ తో తెరకెక్కిన జాంబీ రెడ్డి లాంటి చిన్న సినిమా నిలబడటం అంటే కొద్దిగా కష్టమైన విషయమే.ఒక వేళ నమ్మకంతో రిలీజ్ చేసిన ఆ సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకుంటే జాంబీ రెడ్డికి హిట్ టాక్ వచ్చిన కూడా ఎవరూ ఈ సినిమాపై పెద్దగా ఫోకస్ పెట్టారు.అలాగే మీడియా కూడా దృష్టిపెట్టదు.

ఈ నేపధ్యంలో సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవడం బెటర్ అనే నిర్ణయానికి చిత్ర నిర్మాతలు వచ్చి సినిమా వాయిదా వేసినట్లు తెలుస్తుంది.అయితే ఈ నెల ఆఖరులో లేదంటే వచ్చే నెల మొదటివారంలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

#Anandi #Prasanth Varma #Teja Sajja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు