మార్కెటింగ్ కోసం జోంబీ వేషం.. చివరకు..?!  

zombie dress for marketing finally jambi makeup, marketing, cloths, social media Bussiness, Thailand, Social Media - Telugu Bussiness, Cloths, Jambi Makeup, Marketing, Social Media, Thailand, Zombie Dress For Marketing Finally

ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో వారి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కొందరు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ చివరికి వారి బిజినెస్ ను పెంచుకుంటూ ఉంటారు.అయితే తాజాగా ఆన్లైన్ లో తన బట్టల వ్యాపారం పెంచుకునేందుకు థాయిలాండ్ దేశానికి చెందిన ఓ మహిళ వినూత్న ఆలోచన చేసింది.

TeluguStop.com - Zombie Dress For Marketing Finally

తన వ్యాపారాన్ని కస్టమర్లకు ఆకర్షించే విధంగా ఆమె ఏకంగా ఓ భయంకరమైన వేషధారణతో సోషల్ మీడియాలో కనిపించింది.అది ఎలా అంటే ఓ జోంబీ మేకప్ వేసి అందరినీ భయపెట్టింది.

ఈమె ఈ వేషం వేసుకుని అర్ధరాత్రి ఆన్లైన్ ద్వారా వివిధ రకాలుగా మరణించిన వారికి అవసరమయ్యే విధంగా ఆమె వద్ద ఉన్న దుస్తులతో వాటిని ఎలా వాడుకోవాలో వివరిస్తుంది.దీంతో ఆమెకు ఆన్లైన్ ప్రేక్షకులు పెరగడం మాత్రమే కాకుండా కస్టమర్ల సంఖ్య కూడా పెరిగింది.

TeluguStop.com - మార్కెటింగ్ కోసం జోంబీ వేషం.. చివరకు..-General-Telugu-Telugu Tollywood Photo Image

జోంబీ వేషధారణలో ఆవిడ ఆన్లైన్ ప్రేక్షకులకు వివిధ రకాల దుస్తులను ఎలా వాడుకోవాలో వివరించడం మొదలు పెట్టింది.దింతో ఆవిడ దగ్గర పదుల సంఖ్యలో ఉన్న కస్టమర్స్ సంఖ్య ఏకంగా వేలకు చేరింది ఇప్పుడు.

దీంతో ఆమె వ్యాపారం ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

సదరు మహిళ మాట్లాడుతూ తన వద్ద ఉన్న బట్టలు మరణించిన వారికి ఎలా పనికి వస్తాయో.

వాటిని నేను జోంబీ మేకప్ తో ధరించి వాటిని ఆన్లైన్ ద్వారా ప్రేక్షకులకు వివరించడంతో తనకు మంచి బిజినెస్ వస్తుందని తెలియజేసింది.ఇందుకు సంబంధించిన వీడియోలు తాను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా వాటిని చూసిన కస్టమర్లు కొంచెంకొంచెంగా వాటిపై ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేసింది.

ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా ఆన్లైన్ ప్రేక్షకులు పెరిగినట్లు ఆవిడ తెలిపింది.అయితే జాంబి వేషధారణకు ఆవిడకు ఏకంగా మూడు గంటల సమయం పడుతుంది అని తెలిపింది.

ఇలా తాను సంపాదించిన ఆదాయంలో కొంత మొత్తానికి దేవాలయాలకు విరాళంగా ఇస్తాను అని ఆవిడ చెప్పుకొచ్చింది.

#Jambi Makeup #Thailand #ZombieDress #Marketing #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Zombie Dress For Marketing Finally Related Telugu News,Photos/Pics,Images..