ఆ విషయంలో జొమాటో కీలక నిర్ణయం..?!

ప్లాస్టిక్ రహిత వాతావరణం వలన మనకు, జంతువులకే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.కానీ కొంతమంది మాత్రం ప్లాస్టిక్ వస్తువులను ఇంకా వాడుతున్నారు.

 Zomato's Key Decision In That Regard . Zomato, Key Decison, Latest News, Viral N-TeluguStop.com

ప్లాస్టిక్ వలన సమస్త మానవాళికి ఎన్నో ఇబ్బందులు ఎదురువుతాయనే విషయాన్నీ విస్మరించి మరి ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తున్నారు.ఇకపోతే హోటల్స్, రెస్టారెంట్స్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.

ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాక్సులు, ప్లాస్టిక్ స్పూన్స్ ఇలా చాలా ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నారు.ఈ క్రమంలో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే క్రమంలో జొమాటో యాప్ లో ప్రస్తుత డిఫాల్ట్ మోడ్‌ ని చేంజ్ చేస్తూ ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి అవసరమైతేనే తప్పా ప్లాస్టిక్‌ స్పూన్లు, ఫొర్క్స్ ఇవ్వడం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ ఈ విధంగా ట్వీట్ చేసారు.జొమాటో యాప్‌ లో మీరు ఆర్డర్‌ చేసేటప్పుడు ప్లాస్టిక్‌ స్పూన్లు, ఫొర్క్స్‌ అవసరం లేదనుకునేవారు వాటిని వద్దు అనే చెప్పే విధంగా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చామని దీపిందర్‌ తెలిపారు.

ఇంకో విషయం ఏంటంటే.మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టేటప్పుడు జొమాటో అప్లికేషన్ మీకు కట్లరీ అవసరమా లేదా అని అడగడం జరుగుతుంది.ఒకవేళ మీకు అవసరం అనుకుంటే మీరు ఆప్ట్-ఇన్ ఆప్షన్స్ ఎంచుకోవాలి.అదే వద్దనుకుంటే ఆప్ట్-అవుట్‌ ఆప్షన్‌ ని ఎంచుకోవాలి.

Telugu Delivery, Key Decison, Latest, Zomato-Latest News - Teluguస్పూన్ల డిఫాల్ట్ డెలివరీని నిలిపివేయడం వలన కంపెనీకి ఒక రోజులోనే 5,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఆదా చేయగలదని గోయల్ వివరించారు.నిజం చెప్పాలంటే జొమాటో ఈ నిర్ణయం తీసుకునే ముందు తమ కస్టమర్స్ అభిప్రాయం సేకరించిందట.

అందులో బాగంగా 90% మంది కస్టమర్లు తమ ఆర్డర్‌ లతో పాటు ప్లాస్టిక్ కట్లరీలను డెలివరీ చేయాల్సిన పని లేదని చెప్పారట.అందుకే జొమాటో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఏది ఏమయినా ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే క్రమంలో జొమాటో సంస్థ కూడా తన వంతు కృషి చేస్తుంది అన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube