ఆదర్శం : కల కన్నాడు, కష్టపడ్డాడు రూ 2.20 లక్షలతో బైక్‌ కొన్నాడు  

Zomato Dery Boy Buy His Dream Bike-

ప్రతి ఒక్కరు కలలు కనాలి, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అనే వారు.కలలు కంటేనే కష్టపడగలం.ఎంత పెద్ద కలైతే కంటామో అంత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది...

Zomato Dery Boy Buy His Dream Bike--Zomato Delivery Boy Buy His Dream Bike-

కష్టపడితే సాధ్యం కానిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు.కష్టానికి సర్వం బానిస అవ్వాల్సిందే అంటూ పెద్దలు అంటారు.ఈ సూత్రాన్ని బాగా నమ్మిన సూరజ్‌ ఒక కల కన్నాడు.

ఒక సామాన్యమైన ఫ్యామిలీ నుండి వచ్చి, ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఏకంగా 2.20 లక్షల రూపాయలతో డ్రీమ్‌ బైక్‌ కొనుగోలు చేసి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Zomato Dery Boy Buy His Dream Bike--Zomato Delivery Boy Buy His Dream Bike-

అసలు విషయం ఏంటీ అంటే హర్యానాకు చెందిన సూరజ్‌ అనే ఒక మద్యతరగతి కుర్రాడికి కేటీఎం ఆర్సీ 200 బైక్‌ అంటే చాలా మోజు.దాదాపు 2.20 లక్షల విలువ ఉండే ఆ బైక్‌ను కొనుగోలు చేసేంత స్థాయి, ఆర్థిక వనరులు అతడి వద్ద లేవు.దాంతో అతడు ఎలాగైనా ఆ బైక్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు.అందుకోసం జొమాటో ఫుడ్‌ డెలవరీ బాయ్‌గా చేరాడు.ఉదయం నుండి అర్థరాత్రి 12 గంటల వరకు అలుపెరగకుండా కష్టపడి డెలవరీ ఇచ్చేవాడు.

ఎంత దూరం అయినా కూడా ఏమాత్రం వెనకాడకుండా ఫుడ్‌ డెలవరీ ఇచ్చేసి వచ్చేవాడు.దాంతో అతడు నెలకు రూ.

40 వేల నుండి రూ.45 వేల వరకు సంపాదించాడు.అలా అయిదు నెలల జీతంను దాచుకుని తన వద్ద పాత బైక్‌ను అమ్మగా వచ్చిన డబ్బుతో స్పాట్‌ పేమెంట్‌ కట్టి ఆర్సీ 200 బైక్‌ను కొనుగోలు చేయడం జరిగింది.ఈ విషయం జొమాటో వ్యవస్థాపకుడు దీపీందర్‌ గోయల్‌కు తెలిసి సూరజ్‌ను అభినందించి ఫొటోను కూడా షేర్‌ చేశాడు.కష్టపడితే సాధ్యం కాదు అనే విషయం సూరజ్‌ను చూసి తెలుసుకోవాలంటూ ఆయన యువకులకు సలహా ఇచ్చారు.నిజంగా సూరజ్‌ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాల్సిందే.