అపారమైన తెలివితేటలు కలిగిన రాశులు ఏమిటో తెలుసా?   Zodiac Signs That Are The Smartest     2018-02-23   21:44:51  IST  Raghu V

సాధారణంగా ప్రతి ఒక్కరు జీవితంలో ఎదో ఒక సమయంలో జాతకం చూసుకుంటూ ఉంటారు. జాతకం అనేది మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా మన IQ మీద కూడా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే వారి ఆలోచన తీరుపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. మొత్తం 12 రాశుల్లో కొన్ని రాశుల వారు అపారమైన తెలివితేటలను కలిగి ఉంటారు. ఆ రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం.

తుల రాశి
ఈ రాశి వారు తమ చుట్టూ సామరస్య వాతావరణం ఉండేలా చేసుకోవటంలో దిట్ట. విభేదాలు,గొడవలు కలిగినప్పుడు కూడా మంచి పరిష్కారాన్ని కనుగొంటారు. మిగతావారు సమస్యను ఆలా చూస్తూ కూర్చుంటే ఈ రాశి వారు మాత్రం సమస్యను వారి తెలివితేటలతో పరిష్కరిస్తారు. వీరు ముక్కుసూటిగా మాట్లాడతారు.


కుంభ రాశి
ఈ రాశి వారు అపారమైన తెలివితేటలను కలిగి ఉంటారు. ప్రతి విషయాన్నీ విశేషణ చేస్తారు. వీరికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు జ్ఞానాన్ని ఆర్జించటమే కాకుండా పక్క వారికీ కూడా పంచాలని అనుకుంటారు. ఏదైనా విషయాన్నీ నేర్చుకోవాలని అనుకుంటే ఆ విషయాన్నీ లోతుగా నేర్చుకుంటారు.

కన్య రాశి
ఈ రాశి వారు ఒక పద్దతికి కట్టుబడి ఉంటారు. వీరు ప్రతి విషయాన్నీ విశ్లేషణ బాగా చేస్తారు. ఏదైనా పని కోసం అడుగు వేసే ముందు అన్ని రకాలుగా ఆలోచిస్తారు. లాజిక్ ని అసలు మిస్ అవ్వరు. వీరు సహజంగా కాస్త కన్నింగ్ నేచర్ మరియు విమర్శనాత్మక స్వభావం కలిగిన వారు. అలాగే వీరి మైండ్ సెట్ ఎక్కువగా ఎకనామికల్ గా ఉండటం వలన వీరు ఇన్వెస్టర్స్ గా నిలబడగలుగుతారు.

మీన రాశి
వీరికి ఇతరులను అర్ధం చేసుకొనే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎమోషన్స్,తెలివితేటలు రెండు ఎక్కువే. ఈ రాశి వారికీ వారికి ఏదైనా తప్పు జరిగే ముందు కొంచెం ముందుగానే తెలిసే అవకాశం ఉంది. వారి సిక్స్త్ సెన్స్ అనేది వారిని ఆపదల నుంచి కాపాడుతుంది. ఆయా సిట్యువేషన్ ని ఏ విధంగా డీల్ చేయాలో వారికి సులభంగా తెలుస్తుంది.

సింహ రాశి
ఈ రాశికి చెందిన వ్యక్తులలో అంతర్భుద్ది సామర్థ్యం ఎక్కువగా ఉండుట వలన వారి లక్ష్యాల దిశగా వారి ప్రయత్నం సాగుతుంది. వీరికి దృఢమైన వ్యక్తిత్వం ఉండుట వలన వారి లక్ష్యాలను సాధించే క్రమంలో వచ్చే అవరోధాలు సులభంగా దాటేస్తారు. వీరి మీద ఎవరైనా విమర్శలు చేస్తే తట్టుకోలేరు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.