ఈ రాశులు విసుగుకు బ్రాండ్ అంబాసిడర్లు మీకు తెలుసా       2018-04-21   00:44:31  IST  Raghu V

మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. జాతకాలను నమ్మేవారు వారి రాశి ప్రకారం ఏమి జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటారు. ఆలా ఫాలో అయ్యేవారు కూడా ఉన్నారు. అయితే ఇప్పడు అత్యంత విసుగును కలిగించే కొన్ని రాశులు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మకర రాశి
ఈ రాశి వారికి విపరీతమైన విసుగు,నిస్తేజం ఉంటాయి. వీరి మనస్సు ఉల్లాసంగా ఉండదు. ఎప్పుడు వీరి మనస్సు భయం,ఆత్రుత,ఆలోచనల మధ్య తిరుగుతూ ఉంటుంది. దాంతో విసుగు అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. అలాగే వీరి విసుగును భరించటం కూడా కష్టమే. అయితే వీరు వ్యక్తిగతంగా వివేకవంతులు.

కన్య రాశి
విసుగుతో మొదటి స్థానం మకర రాశిది అయితే రెండో స్థానం కన్య రాశిది. వీరు ఏది చేసిన ప్రణాళిక బద్దంగా అలోచించి మాత్రమే చేస్తారు. దానికి ఏ మాత్రం తేడా వచ్చిన విపరీతమైన విసుగు వచ్చేస్తుంది. ప్రతి చిన్న విషయానికి అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు.

తుల రాశి
వీరు ఎక్కువగా ఆచరణాత్మకంగా ఉండి ఊహలకు దూరంగా ఉంటారు. వీరికి దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని విషయాలకు విపరీతమైన విసుగును ప్రదర్శించి ఎదుటి వారి ముందు చులకన అవుతూ ఉంటారు. వీరి మాట ఎవరైనా వినకపోయిన విపరీతమైన విసుగు ఏర్పడుతుంది.

కర్కాటక రాశి
ఈ రాశి వారు వారి మనస్సుకు విరుద్ధంగా ఏమైనా జరిగితే అసలు తట్టుకోలేరు. కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే ఇష్టం ఉండదు. వీరికి నాటకాలు వేస్తూ ఉండేవారంటే అసలు గిట్టదు. వారికీ దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. వీరిలో ఉన్న విసుగును వారి ప్రియమైన వారు కూడా గురించలేరు.

,