ఈ రాశుల అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే అమ్మాయిల అదృష్టం   Zodiac Signs Ranked As Best Husbands     2018-02-22   23:34:51  IST  Raghu V

ప్రతి అమ్మాయి మంచి భర్త వచ్చి తన జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుంది. కొంత మంది అమ్మాయిలు భర్త తాను చెప్పిన మాట వినాలని అనుకుంటారు. ఆలా కొంతమంది అబ్బాయిలు వింటారు. కానీ కొంత మంది అబ్బాయిలు మాట వినకుండా మొండిగా ఉంటారు. భార్య సైడ్ నుంచి ఆలోచిస్తే ఏ రాశి అబ్బాయి మంచివాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రాశుల వారు టాప్ పోజొషన్ లో ఉంటారు.

వృషభ రాశి
అబ్బాయిలు భార్యల పట్ల బాగా నమ్మకంగా ఉండి టాప్ పొజిషన్ లో ఉన్నారు. వృషభ రాశి అబ్బాయిలు భార్యలను అసలు చీట్ చేయరు. ప్రతి అమ్మాయి భర్తగా వృషభ రాశి అబ్బాయి రావాలని కోరుకుంటుంది.

ధనస్సు రాశి
ఈ రాశి వారు భార్యల పట్ల నమ్మకం విషయంలో రెండో స్థానంలో ఉంటారు. ఈ రాశివారు భార్యతో అబద్దం చెప్పకుండా చాలా ప్రేమగా చూసుకుంటారు. భార్య ఎలా చెప్పితే ఆలా నడుచుకుంటారు.

మీన రాశి
ఈ రాశి వారు భార్యల పట్ల నమ్మకం విషయంలో మూడో స్థానంలో ఉంటారు. వీరికి ఎంత ఒత్తిడి ఉన్న భార్యను అసలు అశ్రద్ధ చేయకుండా ప్రేమగా చూస్తారు. ఇలాంటి అబ్బాయి భర్తగా రావటం అదృష్టం.

మకర రాశి
ఈ రాశి వారు భార్యల పట్ల నమ్మకం విషయంలో నాల్గొవ స్థానంలో ఉంటారు. ఈ రాశివారు భార్యతో గొడవ రాకుండ చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరి మధ్య ఏమైనా ఆర్ధిక పరమైన గొడవలు వచ్చిన సర్దుకుపోతారు.

సింహ రాశి
ఈ రాశి వారు భార్యల పట్ల నమ్మకం విషయంలో ఇదో స్థానంలో ఉంటారు. వీరు భార్యతో నిజాయతీగా ఉండి ప్రతి విషయాన్ని తుచ తప్పకుండా చెప్పుతారు. ఈ రాశి భర్త చేసే తప్పులను కూడా భార్యకు చెప్పటంతో భార్య మనస్సులో మంచి స్థానాన్ని సంపాదిస్తాడు.

కర్కాటక రాశి
ఈ రాశి వారు భార్యల పట్ల నమ్మకం విషయంలో ఆరో స్థానంలో ఉంటారు. వీరు బయట పనులతో ఎంత బిజీగా ఉన్న సరే భార్యకు తగిన సమయాన్ని కేటాయిస్తారు. భార్యను చాలా అమితంగా ప్రేమిస్తారు.

మిధున రాశి
ఈ రాశి వారు భార్యల పట్ల నమ్మకం విషయంలో ఏడోవ స్థానంలో ఉంటారు. ఈ రాశి వారు భార్యను ప్రేమగానే చూసుకుంటారు. అయితే అప్పుడప్పుడు కొన్ని కారణాలతో భార్యపై కోపం వస్తుంది.

వృచ్చిక రాశి
ఈ రాశి వారు భార్యల పట్ల నమ్మకం విషయంలో ఎనిమిదొవ స్థానంలో ఉంటారు. వీరు నమ్మకంగా ఉంటారు. కాని ఒకసారి అతి ప్రేమ చూపిస్తారు. ఒక్కోసారి విపరీతమైన కోపాన్ని చూపిస్తారు.

మేష రాశి
ఈ రాశి వారు భార్యల పట్ల నమ్మకం విషయంలో తొమ్మిదొవ స్థానంలో ఉంటారు. వీరు భార్యను ప్రేమగా చూస్తారు. ఈ రాశి వారు ఆర్ధికంగా స్థిరపడి ఉంటారు. అందువల్ల ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు. అప్పుడప్పుడు కాస్త కోపంగాను,మాట వినకపోవడం వంటివి ఉంటాయి.

కన్య రాశి
ఈ రాశి వారు భార్యల పట్ల నమ్మకం విషయంలో పదోవ స్థానంలో ఉంటారు. వీరు భార్య పట్ల ప్రేమగా ఉన్నా సమాజంలో గొప్పగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం భార్య ఏమైనా తప్పు చేస్తే భార్యను తిడుతూ ఉంటారు.

కుంభ రాశి
ఈ రాశి వారు భార్యల పట్ల నమ్మకం విషయంలో పదకొండో స్థానంలో ఉంటారు. వీరు భార్యను ప్రేమగా చూసుకున్న అప్పుడపుడు చిర్రు బుర్రులాడుతూ ఉంటారు. సంసారంలో వచ్చే వచ్చే సమస్యల గురించి అడిగితె కోప్పడతారు.

తుల రాశి
ఈ రాశి వారు భార్యల పట్ల నమ్మకం విషయంలో ఆఖరి స్థానంలో ఉంటారు. వీరు కూడా భార్యతో చాలా స్నేహంగా మెలుగుతారు. అయితే వీరు చెప్పుడు మాటలు విని భార్యను అనుమానిస్తారు. కానీ అర్థం చేసుకుంటే తులరాశి వారు కూడా మంచి భర్తలే.