దీపావళి తర్వాత రెండు నెలలు ఈ నాలుగు రాశుల వారు పట్టిందల్లా బంగారమే...! మీ రాశి ఉందేమో చూడండి!   Zodiac Results After Deepavali Festival     2018-11-04   09:00:38  IST  Sainath G

దసరా పండుగ తర్వాత వచ్చే దీపావళి అంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా సంబరమే. ఆ రోజు లక్ష్మి పూజ చేసుకొని టపాసులు కాల్చుకొని మిఠాయిలు తింటారు. అయితే ఈ దీపావళి పండుగ తర్వాత కొన్ని రాశుల వారికీ బాగా కలిసిరావటమే కాకుండా ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అది ఏ రాశివారికో ఇప్పుడు మనం తెలుసుకుందాము.

వృశ్చిక రాశి ,మీన రాశి ,వృషభ రాశి ఈ రాశులకు రాహువు అద్భుతమైన యోగాన్ని ఈ రెండు నెలల పాటు ఇవ్వనున్నాడు. వృశ్చిక రాశి ,కన్యా రాశి ,వృషభ రాశి ఈ రాశులకు కేతువు ధన యోగాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వనున్నాడు. ఈ నాలుగు రాశుల వారు ఈ రెండు నెలల్లో ఏ పని చేసిన రాహు కేతు ప్రభావం వలన సక్సెస్ అవుతాయి. నవంబర్,డిసెంబర్ నెలలో వీరి చేసే ప్రతి పని కలిసి రావటమే కాకుండా పట్టిందల్లా బంగారం అనే విధంగా ఉంటుంది.

Zodiac Results After Deepavali Festival-

ఈ రెండు నెలల్లో కేతువు ఆధ్యాత్మిక శక్తిని,మానసిక శక్తిని,శారీరక శక్తిని ఇస్తున్నాడు. రాహువు ఆరోగ్య సమస్యలు లేకుండా మరియు అప్పుల బాధలు లేకుండా చేస్తున్నాడు. ఇంటిలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చేస్తున్నాడు.

Zodiac Results After Deepavali Festival-

ఉద్యోగం చేసే వారికీ ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. జీతాలు పెరగటం,మంచి ప్రమోషన్స్ రావటం, వారు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సొంతంగా వ్యాపారం చేసే వారికీ సమయం అనుకూలంగా ఉండుట వలన అదనపు పెట్టుబడి పెట్టవచ్చు. మొండి బకాయిలు అన్ని వచ్చేస్తాయి. దాంతో ప్రశాంతంగా ఉంటారు. అంతేకాక ఈ రాశులవారు జీవితంలో అత్యున్నమైన స్థితిలో ఉంటారు. ఈ నాలుగు రాశుల వారు దీపావళి రోజు ఇల్లంతా వెలుగు నిండేలా దీపాలను వెలిగించాలి. దీపాలు వెలిగించటానికి ఆవునెయ్యిని ఉపయోగించాలి. లక్ష్మీదేవిని భక్తి శ్రద్దలతో పూజించాలి. అలాగే పేదవారికి తోచిన సహాయం చేయాలి.