కేరళలో భయపెడుతున్న జికా వైరస్..!

కరోనా సెకండ్ వేవ్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనిపిస్తున్న దేశంలో మరో వైరస్ ఆందోళన కలిగిస్తుంది.కేరళలో జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చాయి.

 Zika Virus Cases In Kerala , Cases, Health Department, Kerala, Thiruvananthapurm-TeluguStop.com

తిరువనంతపురంలో జికా వైరస్ కేసు నిర్ధారించబడిందని ఆరోగ్య మంత్రి వెల్లడించారు.బాధితురాలు తిరువనంతపురంలో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.24 ఏళ్ల గర్భిణీ స్త్రీకి ఈ వ్యాధి సోకిందని సమాచారం.జ్వరం, తలనొప్పి, చర్మంపై ఎర్రటి గుర్తులు లాంటి లక్షణాలు హాస్పిటలతో ఈ వైరస్ కనిపిస్తుంది.

ప్రాధమిక పరీక్షలలో అది జికా వైరస్ అని నిర్ధారణ అవుతుంది.బాధిత మహిళ శాంపిల్స్ ను పూణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలకీ కు పంపించారు.

అయితే ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య అధికారులు చెప్పారు.

తిరువనంతపురం జిల్లాలోనే మరో 19 మందికి లక్షణాలు ఉండగా శాంపిల్స్ పరీక్షలు చేశారు.

వారిలొ 13 జికా వైరస్ పాజిటివ్ అని తేలిందట.అయితే ఈ విషయాన్ని ఎన్.ఐ.వి ఇంకా ధృవీకరిచలేదు.జికా వైరస్ కేసులు ఎక్కువ కాకుండా వెంటనే ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.వ్యాధి నిరోధించడానికి తగిన చర్యలను చేపడుతున్నారు.అధికారులు, నిపుణులు వ్యాధి వస్తున్న స్థాలాన్ని సందర్శించి నివారణ చర్యలను చేపడుతున్నారు.దోమ కాటు ద్వారా ఈ వైరస్ వస్తుందని తెలుస్తుంది.

జికా వైరస్ లక్ష్ణాలు చికున్ గున్యా మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు.జికా వైరస్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఏమి ఉండవని.

రోగి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube