కంపెనీ పెట్టిన కాంపిటేషన్ రివార్డ్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...

దేశంలో చాలా కంపెనీలు తమ కంపెనీ ఉత్పత్తుల కోసం వివిధ రకాల కార్యక్రమాలను చేస్తూ ఉంటాయి.ఇక తమ ఉద్యోగులను ప్రోత్సహించడానికి మంచి ప్రతిభను కనబరిచే వారికి వివిధ రకాల అదనపు ప్రోత్సాహకాలను అందిస్తుంటాయి.

 Zerodha Company Fitness Challenge To Its Employees With 10 Lakhs Reward Details,-TeluguStop.com

ఆఫీస్ లో పని పై కొత్త మార్గాన్ని తీసుకురావడానికి కొత్త కొత్త టాస్క్ లను ఇస్తారు.ఇలా చేస్తున్న వారికి పోటీ పెట్టి బహుమతులు, రివార్డులను ఇస్తూ ఉంటారు.

ఇటీ వల ఓ కంపెనీ ఇలాంటి ఆఫర్ ను తమ ఉద్యోగులకు అందించింది.ఆ ఛాలెంజ్‌లో గెలిచిన వారికి బోనస్‌తో పాటు భారీ నజరానా కూడా ప్రకటించింది.

జిరోదా కంపెనీ తమ ఉద్యోగుల ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా ఉద్యోగులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కంపెనీ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను తమ ఉద్యోగులకు ఇచ్చింది.ఇక ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని పూర్తి చేసిన ఉద్యోగికి కంపెనీ 1 నెల జీతం బోనస్ అలాగే రూ.10 లక్షల రివార్డును అందజేస్తుందిన కంపెనీ చీఫ్ ప్రకటించారు.అయితే ఫిట్‌సెన్ లక్ష్యాన్ని సాధించడానికి కంపెనీ ఫిట్‌నెస్ ట్రాకర్‌లో రోజువారీ కార్యాచరణ లక్ష్యాలను సెట్ చేసుకోవాలని ఉద్యోగులకు చెప్పింది.ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ హెడ్ నితిన్ కామత్ ట్వీట్ చేశారు.

Telugu Lakhs Reward, Employees, Fitness, Nithin Kamath, Zerodha, Zerodha Company

ఈ ఫిట్‌నెస్ ట్రాకర్‌లో మీ లక్ష్యాలను సెట్ చేసుకుని, పూర్తి చేయడం ద్వారా కంపెనీ ప్రకటించిన రివార్డ్‌లను అందుకోవచ్చు.ఛాలెంజ్‌లో భాగంగా ఉద్యోగులు రోజుకు కనీసం 350 కేలరీలు బర్న్ చేయాలని చెప్పారు.ప్రస్తుతం కాలం లో చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నందున కంపెనీ ఈ ఛాలెంజ్ ఇచ్చింది.వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంట్లో కూర్చోవడం వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారనీ, అందుకే ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగులను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ రకమైన ఫిట్‌నెస్ ఛాలెంజ్ ప్రారంభించామని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube