మహిళల పై నేరాల నియంత్రణకు జీరో ఎఫ్ఐఆర్ అధికారుల పై కూడా చర్యలకు సూచన కేంద్ర ప్రభుత్వం.

మహిళల పై జరుగుతున్న నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు,కేంద్ర పాలిత ప్రాంతాలకు.కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

 Zero Fir To Control  Crime Against Women.  Central Governament, Womens, Rape And-TeluguStop.com

దేశ వ్యాప్తంగా మహిళల పై పెరిగిపోతున్న అత్యాచారాలు,లైంగిక దాడులు, దౌర్జన్యాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ కీలక ఆదేశాలు జారి చేసింది.

మహిళల పై లైంగిక దాడి లేదా అత్యాచారం జరిగిందని తెలిస్తే రెండు నెలల్లోపు ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి జాతీయ డేటాబేస్ లో అప్డేట్ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

తరుచుగా నేరాలకు పాల్పడుతున్న వారి డేటాను కూడా ప్రత్యేకంగా సేకరించాలని తెలిపింది.మహిళల పై అగయిత్యాలు జరిగినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో కి రానప్పుడు జీరో ఎఫ్ఐఆర్ దాఖలు కు అవకాశం కల్పించాలని తాజా ఆదేశాల్లో కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఆ తరువాత సంబంధిత పోలీస్ స్టేషన్ కి ఎఫ్ఐఆర్ పంపాలని సూచించింది.

Telugu Central, Hathras, Uttarpradesh, Womens, Zero Fir-Latest News - Telugu

ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో యువతి పై జరిగిన హత్యాచారం మరియు హత్య విషయం లో యూపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలు ఇచ్చింది.మహిళల పై అగాయిత్యలు జరిగినప్పుడు వెంటనే గుర్తించి చర్యలు తీసుకొనేలా చట్టాల్లో కఠినమైన నిబంధనలు పొందు పరచామని,వాటి అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందే అని కేంద్రం తాజా ఆదేశాల్లో వెల్లడించింది.హత్రాస్ దారుణం పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడం,ఉత్తరప్రదేశ్ పోలీసుల పాత్ర పై విమర్శలు భారీగా వెల్లువెత్తుతున్న సందర్బంగా కేంద్ర హోంశాఖ ఈ తాజా మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube