కామెడియన్ సప్తగిరిని ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి ?

రేపు కామెడియన్ సప్తగిరి హీరోగా నటించిన మొదటి సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ విడుదల అవుతోంది.ఈ విషయం మీకు ఈపాటికే తెలిసి ఉంటే మంచిది, మేం చెప్పేదాకా తెలియలేదంటే, సప్తగిరికి కష్టాలు తప్పవు.

 Zero Buzz For Sapthagiri Express-TeluguStop.com

రేపే సినిమా రిలీజ్ అవుతోంటే ఇంతవరకు హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క షో కూడా ఫుల్ అవలేదు.

నిజానికి థియేటర్లు తక్కువ దొరికాయి.

ఉన్న థియేటర్లలో ఒక్క షో కూడా మంచి రెస్పాన్స్ రాబట్టలేదు ఇప్పటివరకూ.ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చి ఇప్పుడు సడెన్ గా హైప్ అంతా మాయమవడం నిజంగా విడ్డూరం.

మొన్న వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా ఈ సినిమాతో పోల్చుకుంటే చాలా బెటర్ పోజిషన్ లో ఉండింది.

అయినా, కామెడియన్ హీరోగా మారితే మాత్రం జనాలు ఎగబడి వస్తారు అనుకుంటే పొరపాటే.

మంచి స్వింగ్ లో ఉన్న 30 ఇయర్స్ ఫృథ్వీ ముఖ్య పాత్ర పోషించిన “మీలో ఎవరు కోటిశ్వరుడు” ఇంకా థియేటర్లలోనే ఉన్నా, ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా జనాలకి తెలియదు.ఇప్పుడు సప్తగిరి ఎక్స్‌ప్రెస్ పరిస్థితి అలానే ఉంది.

మరి రేపు ఏమైనా ఈ సినిమా జనాల్ని రాబట్టి సప్తగిరి కెరీర్ ని మరో మలుపు తిప్పి, హీరోగా అవకాశాలు తెప్పిస్తుందో లేక జయమ్ము నిశ్చయమ్మురా, మీలో ఎవరు కోటీశ్వరుడు లాగా చతికిలపడి, కామెడియన్ గా కంటిన్యూ అయతేనే బాగుంటుంది అని సప్తగిరి అనుకునేలా చేస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube