‘కె. జి. ఎఫ్ – 2’ శాటిలైట్ రైట్స్‌ను సొంతం చేసుకున్న జీ తెలుగు, జీ కన్నడ, జీ తమిళ్ మరియు జీ కేరళమ్

20 ఆగష్టు: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘కే.జీ.

 Zee Telugu, Zee Kannada, Zee Tamil And Zee Kerala Own The ‘kgf-2’ Satellite-TeluguStop.com

ఎఫ్ ఛాప్టర్-1’ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే.మాస్ ఫైటింగ్‌లు, అద్భుతమైన సెట్టింగ్‌లు, భారీగా ఎలివేషన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ప్రతీ అంశం యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అద్భుతమైన క్లైమాక్స్‌తో ముగిసిన ఈ సినిమా తదుపరి కథ ‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-2’ లో తెలియనుంది.దీంతో ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

వాళ్ళందరికి ఊరట ఇవ్వడానికి ఈ సినిమా సీక్వెల్, KGF చాప్టర్ 2 టీజర్ రిలీజ్ చేయగా, ట్విట్టర్ యూట్యూబ్‌ లలో ట్రెండింగ్‌లో నిలవడమే కాకుండా, డిజిటల్‌గా 208 మిలియన్ వీక్షణలను సంపాదించింది.జీ నెట్‌వర్క్ యొక్క 4 దక్షిణ ఛానల్‌లు ఇప్పుడు ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ ని స్వాధీనం చేసుకున్నాయి.

ఈ సందర్భంగా EVP & క్లస్టర్ హెడ్ సౌత్ బిజినెస్ సీజు ప్రభాకరన్ మాట్లాడుతూ, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL), ” కె.జి.ఎఫ్ చాప్టర్ 2 శాటిలైట్ రైట్స్ ద్వారా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాను దక్షిణాదిలోని ప్రతి తెరపైకి తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది.మొత్తం 4 దక్షిణ భాషలలో ప్రేక్షకులకు వారి సౌకర్యం, భద్రతలో వినోదాన్ని అందించేందుకు మేము ఎల్లప్పుడూ అడుగులువేస్తాం.ఈ అసోసియేషన్ ద్వారా మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఛానల్ అభిమానులకు మమల్ని ఇంకా దగ్గరచేస్తుందని భావిస్తున్నాము.”

తెలుగు క్లస్టర్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ, “జీ లో, మేము తీసుకునే ప్రతి నిర్ణయం ప్రేక్షకుల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాం.మన కథలు మన మార్కెట్‌లో మాత్రమే కాకుండా భారతదేశమంతటా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.అలాంటి తరుణంలో తెలుగుతో సహా మిగితా 3 దక్షిణ భాషలలో కె.జి.ఎఫ్ – 2 శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది.జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బ్లాక్‌బస్టర్ చిత్రాలతో మా అనుబంధం ఈ విధంగా ఇంకా బలపడనుంది.మారుతున్న కాలంతో పాటు, ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా మా యొక్క కథలు ఉండడం అందరికి తెలిసిందే.

అలాంటి కథల మధ్య కె.జి.ఎఫ్ – 2 దాని కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.కథనంలో వైవిధ్యం, నాణ్యత ఉన్న కథలని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించాలని మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాం.ఈ సినిమా వీక్షకులకు నచ్చుతుందని అలాగే ఎంటర్టైన్మెంట్ కి అడ్రస్ గా మారుతుందని భావిస్తున్నాను.”

దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, “కె.జి.ఎఫ్ – 2 శాటిలైట్ హక్కులు జీ సొంతం చేసుకున్నందుకు, అలాగే వారి ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు మేము ఇంకా దగ్గరవుతునందుకు నేను చాల సంతోషపడుతున్నాను.సినిమా టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ చూసి నేను థ్రిల్ గా ఫీల్ అయ్యాను.అందరి అంచనాలకు అనుగుణంగా ఉంటుందని, అలాగే కె.జి.ఎఫ్ లెగసి ని ఇంకో తారాస్థాయికి తీసుకెళుతుందని నా నమ్మకం.”

జీ నెట్‌వర్క్‌తో అసోసియేషన్ గురించి హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్ కిర్గందూర్ మాట్లాడుతూ, “జీ నెట్వర్క్ తో ఈ అసోసియేషన్ మాకు చాలా సంతోషంగా ఉంది.జీ ద్వారా మేము ఇంకా ప్రేక్షకులకు దగ్గరవుతామని భావిస్తున్నాను.

హోంబలే ఫిల్మ్స్‌ ఎప్పుడు కూడా కథకు ప్రాధాన్యతనిస్తూ, అందరిని ఆకట్టుకునేలా రూపొందించడానికి మేము ప్రయత్నిస్తాము.”కె.జి.ఎఫ్ చాప్టర్ 1 రికార్డు స్థాయిలో విజయం సాధించిన తర్వాత, కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా ట్రైలర్ యాక్షన్ థ్రిల్లర్ అంచనాలను మరింతగా పెంచింది.

Telugu Homebay, Kgf, Prashant Neel, Yash, Satellite, Sunil Dutt, Zee Kannada, Ze

“కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ని అభిమానుల అంచనాలకి తగట్టుగా, చాప్టర్ 1 లెగసీని ముందుకు తీసుకెళుతూ, అత్యుత్తమ సినిమాను అందించడానికి ప్రయత్నించాము.కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ని కూడా అందరూ అంతే ప్రేమ & ఆప్యాయతతో ముంచెత్తుతారని, ఇది మరొక బెంచ్మార్క్ గా నిలుస్తుందని అనుకుంటున్నాను” అని చెప్పారు విజయ్ కిర్గందూర్.కె.జి.ఎఫ్ మరియు ఈ అసోసియేషన్ గురించి రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ “కె.జి.ఎఫ్ 2 కి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది.నా దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిర్గందూర్, నేను నమ్మిన కథను ప్రేక్షకులు ఇంతలా ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.యావత్ భారతదేశ ప్రేక్షకులు ఇచ్చిన మద్దతు అపారమైనది.

జీ ప్రారంభమైనప్పటి నుండి భారతీయ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది.జీ సౌత్ క్లస్టర్‌తో ఈ విధంగా అసోసియేట్ అవడం నాకు సంతోషంగా ఉంది.ఇదే విధంగా మా ప్రయాణం వీళ్ళతో కలిసి ముందుకు కొనసాగించాలని ఆశిస్తున్నాను.”

హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్, శ్రీనిధి శెట్టి, సునీల్ దత్ మరియు రవీనా టాండన్ ప్రధాన పాత్రాలు పోషించారు.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.

విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.

ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube