అంత కష్టపడినా మహేష్ టీఆర్పీ రికార్డు బద్దలు కొట్టలేకపోయిన వకీల్ సాబ్!

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఇమేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.సినిమాల పరంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు.

 Zee Telugu Top Trp Rating Movies Vakeel Saab Gets 19 12 Here Are The Details-TeluguStop.com

తాజాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన “వకీల్ సాబ్” సినిమా ద్వారా పవర్ స్టార్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ సందడి చేశారు.

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఏప్రిల్ 9న విడుదల అత్యధిక వసూళ్లు రాబట్టింది.

 Zee Telugu Top Trp Rating Movies Vakeel Saab Gets 19 12 Here Are The Details-అంత కష్టపడినా మహేష్ టీఆర్పీ రికార్డు బద్దలు కొట్టలేకపోయిన వకీల్ సాబ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే వకీల్ సాబ్ కేవలం థియేటర్స్ లో మాత్రమే కాకుండా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ అక్కడ కూడా పాజిటివ్ టాక్ సంపాదించింది.

తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా టీవీలో ప్రసారమైన సంగతి మనకు తెలిసిందే.జూలై 18 ఆదివారం జీ తెలుగులో “వకీల్ సాబ్” సినిమా ప్రసారం అయింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టిఆర్పి రేటింగ్స్ వచ్చాయి.పవన్ కళ్యాణ్ సినిమాలలో అత్యధిక టిఆర్పి రేటింగ్ సాధించిన సినిమా అని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే జీతెలుగులో ప్రసారమైన సినిమాలలో అత్యధిక రేటింగ్ సంపాదించుకున్న సినిమాలలో మహేష్ బాబుశ్రీమంతుడు” సినిమా మొదటి స్థానంలో ఉంది.

Telugu Allu Arjun Dj, Director Venu Sri Ram, Geetha Govindam, Mahesh Babu, Pawan Kalyan News, Pspk 28, Sri Manthudu, Tollywood Movies Trp Ratings, Vakeel Saab, Vakeel Saab On Zee Telugu, Vakeel Saab Trp Ratings, Vijay Devarakonda-Movie

శ్రీమంతుడు సినిమా ఏకంగా 22.54 రేటింగ్స్‌లో మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన “డీజే” 21.7 రేటింగ్స్ సొంతం చేసుకొని రెండవ స్థానంలో ఉంది.ఇక మూడవ స్థానంలో విజయ్ దేవరకొండ నటించిన “గీతా గోవిందం” 20.8 రేటింగ్స్ తో మూడవ స్థానంలో ఉంది.ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా 19.12 రేటింగ్స్ ను సంపాదించుకొని నాలుగవ స్థానంలో ఉండటం గమనార్హం.సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ టీవీలో మాత్రం మహేష్ రికార్డును పవర్ స్టార్ “వకీల్ సాబ్” సినిమా బ్రేక్ చేయలేకపోయిందని చెప్పవచ్చు.

#Vakeel Saab Zee #Pawan Kalyan #Venu Sri Ram #Allu Arjun DJ #Pspk

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు