1000వ ఎపిసోడ్ మైలురాయి చేరుకోనున్న జీ తెలుగు ధారావాహిక 'గుండమ్మ కథ

సాదారణంగా ప్రేక్షకులు ఒక సీరియల్ ని సుదీర్ఘకాలం పాటు ఇష్టపడాలంటే బలమైన కథ ఉండాలి, మనసుని హత్తుకునే పాత్రలుండాలి, ఆ పాత్రలలో ఇమిడిపోయే నటీనటులుండాలి, ఉత్కంటగా సాగిపోయే సన్నివేశాలుండాలి ఈ లక్షణాలన్నింటిని పుణికిపుచ్చుకుని జీ తెలుగు మధ్యానపు సీరియళ్ల చరిత్రలోనే ఒక సంచలన ప్రయాణాన్ని సాగిస్తున్న ధారావాహిక గుండమ్మ కథ ఈ 4 నవంబర్ నాడు,గుండమ్మ కథ 1000 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకోనుంది.అంతేనా అందరు ఎంతో ఆసక్తికరంగా వేచిచూస్తున్న కధనం వైపు గుండమ్మ కథ అడుగులు వేయనుంది.

 Zee Telugu Series 'gundamma Katha' Approaching The000th Episode Milestone, Zeete-TeluguStop.com

ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 1: 30 గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతుంది.

గీత పాత్ర పోషిస్తున్న పూజ మూర్తి మాట్లాడుతూ, గుండమ్మ కథ ద్వారా మేము ప్రతి ఒక్కరికి ఒక విషయాన్ని చెప్పదలచుకున్నాము – బాహ్యశరీరాన్ని చూసి ఒకరు మరొకరిని ఎప్పుడూ కించపరుచకూడదు.

వ్యక్తిత్వం చాలా అవసరం.ఎంతో మంది మనసులకు ఈ సీరియల్ నచ్చడం వల్లనే మేము ఇవాళ 1000 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంటున్నాము.ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు గీత జీవితంలో మరో మలుపు రాబోతుంది.ఆ మలుపులు అందరికి నచ్చుతాయని, ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ప్రేరేపితమవుతారని భావిస్తున్నాను.

Telugu Milestone, Diwali, Gundamma Katha, Kalikiraja, Nov, Pooja Murthi, Zee Tel

రామ్ పాత్ర పోషిస్తున్న కల్కి రాజా మాట్లాడుతూ, “గుండమ్మ కథ ఒక సీరియల్ మాత్రమే కాదు, ఒక బ్రాండ్ కూడా.ప్రతి ఒక్క పాత్ర మరియు కధనం అందరి జీవితాలకి చాలా దగ్గరగా అనిపిస్తుంది.గీత పాత్ర ఎంతో మంది ఆడవాళ్ళని ప్రేరేపించింది.1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటున్నామంటే మా గుండమ్మ కథని ఎంతోమంది ఆదరిస్తున్నారు అనడానికి అదే పెద్ద సాక్ష్యం.ఇక ముందుకూడా ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాము.ఎల్లప్పుడూ మాతో కలిసి ప్రయాణిస్తున్న ప్రేక్షకులందరికి శతకోటి ధన్యవాదములు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube