మమతల కోవెలలో తన అభిమానులను రంజిపచేయడానికి 'మాతృదేవోభవ' కార్యక్రమం మరియు 'ఊహలు గుసగుసలాడే' ధారావాహికతో సిద్ధమవుతోంది జీ తెలుగు

అమ్మ – ప్రతి బంధానికి మూలం తనే.అందుకే మన పెద్దలు సైతం ‘మాతృదేవోభవ’, పితృదేవోభవ’ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చారు.

 Zee Telugu Is Gearing Up With 'matrudevobhava' And 'imagination Whispers' Series-TeluguStop.com

ప్రపంచంలో ఏ ప్రాంతలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు.కానీ అమ్మ ప్రేమ మాత్రం మారదు.అమ్మ ప్రేమలాంటి స్వచ్ఛమైన బంధాలు, బాంధవ్యాలతో అందరిని అలరించే జీ తెలుగు ఈ మదర్స్ డే తన అభిమానుల కోసం ఎంతో ప్రత్యేకంగా మార్చబోతుంది.‘మాతృదేవోభవ‘ కార్యక్రమంతో పాటు ‘ఊహలు గుసగుసలాడే’ అనే సరికొత్త ధారావాహికను ప్రసారం చేయనుంది ఈ ఆదివారం మరియు సోమవారం నుంచి.

“మర్మ స్థానం కాదది.నీ జన్మ స్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం” – తల్లిగా ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఇంతకన్నా గొప్పగా వర్ణించలేమేమో!.

కేవలం రెండు లైన్లలోనే స్త్రీ గురించి వేటూరి అద్భుతమైన భావాన్ని వ్యక్తీకరించగలిగారు.అలాంటి అమ్మ ప్రేమను, అమ్మ యొక్క గొప్పతనాన్ని మరోసారి అందరికి తెలియచేయడానికి జీ తెలుగు ‘మాతృదేవోభవ’ అనే కార్యక్రమాన్ని ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మనముందుకు తేబోతుంది.సుధా చంద్రన్, భావన – రాజా రవీంద్ర, డ్రామా జూనియర్స్ ది నెక్స్ట్ సూపర్ స్టార్, స రి గ మ ప లిటిల్ చాంప్స్, మేఘన ఇంద్రనీల్, సిద్ధార్థ్ వర్మ, రవి కిరణ్, బుల్లి తెర మెగాస్టార్ ప్రభాకర్, తన కుటుంబ సభ్యులు, సింగర్ మధు ప్రియ, సింగర్ రేవంత్ తో పాటు ఇంకా ఎంతో మంది అమ్మ యొక్క గొప్పతనాన్ని మనసుకు హత్తుకునే విధంగా ప్రదర్శిరించి వారి జీవితంలో అమ్మ స్థానాన్ని అందరికి తెలియచేయనున్నారు.అంతేకాకుండా తెలంగాణ లో మొట్ట మొదటి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మి మరియు యమునా పాథక్ – సైకాలజిస్ట్, జన్మ ఇవ్వకుండానే ఎంతో మంది చిన్నారులకు అమ్మ గా మారిన ఆమెను మన జీ తెలుగు సగౌరవంగా సత్కరించనుంది.

జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన వెన్నంటి మనకు తోడుగా ఉండి ప్రతి బంధాన్ని కూడా తనలో ఐక్యం చేసుకొని తోడుగా నిలిచే వారినే జీవిత భాగస్వాములు అంటారు.అలాంటి జీవిత భాగస్వామి మనల్ని వదిలేసి వెళ్ళిపోతే? ఆ స్థానం మరి ఒకరికి ఇవ్వడం సాధ్యమేనా? అభిరామ్ (అకుల్ బాలాజీ) మరియు వసుంధర (రూప) ఇరువురి మనసులు కూడా బాధలకు అలవాటుపడినవే.ఇరువురు వారి పిల్లల కోసం పెళ్లి అనే బంధంలో మరోసారి అడుగుపెడితే ఆ బంధం విరిగిన వాళ్ళ మనసులని మళ్లీ చిగురింపచేయగల్గుతుందా? ఆ పిల్లలు వారిని అమ్మ నాన్న గా ఒప్పుకుంటారా? ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలతో అందరిని ప్రేరేపించే జీ తెలుగు ఈసారి కూడా ‘ఊహలు గుసగుసలాడే’ అనే ధారావాహికతో అందరిని అలరించడానికి వస్తుంది మే 10 వ నుంచి మధ్యాహ్నం 1 గంటలకు.

ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మరియు సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ‘మాతృదేవోభవ’ మరియు ‘ఊహలు గుసగుసలాడే’ కార్యక్రమాలను మీ జీ తెలుగులో తప్పక చూడండి.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.

నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.

విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.

ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube