పదహారు ఏళ్లలోకి 'జీ మహోత్సవం' అనే కార్యక్రమంతో అడుగుపెడుతున్న జీ తెలుగు

నవ్వుకి ఖరీదు లేదు.మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు నవ్వు నాలుగు విధాలా తోడ్పడుతుంది.

 Zee Telugu Is Entering Its Sixteenth Year With A Program Called Zee Mahotsavam-TeluguStop.com

సుదీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితానికి నవ్వు ప్రధాన పాత్ర పోషిస్తుంది.యావత్ భారత్ దేశం కరోనా తో పోరాడుతుంటే , తన వంతు భాద్యతగా జీ తెలుగు మనకు ఆనందాన్ని అందిచడం కోసం నవ్వులను విరజిల్లించడానికి తన పుట్టిన రోజు ను ప్రియమైన అభిమానులతో ఈ ఆదివారం మే 16 సాయంత్రం 5 గంటలకు ‘జీ మహోత్సవం’ అనే కార్యక్రమంతో జరుపుకుంటుంది.

2005 , మే 18 నాడు జీ తెలుగు ఛానల్ తెలుగు వారి లోగిలికి ప్రవేశించింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు జీ తెలుగు అంటే మన జీ తెలుగు అని ప్రతి ఒక్కరి నోటా వినపడేంతగా పేరు సంపాదించుకుంది.15 ఏళ్ళు పూర్తి చేసుకొని యుక్త వయసు 16 లోకి అడుగుపెడుతోంది మన జీ తెలుగు ఛానల్.ఫిక్షన్‌, నాన్‌ ఫిక్షన్‌ అనే తేడా లేకుండా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ కార్యక్రమాలను రూపొందిస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించింది.

 Zee Telugu Is Entering Its Sixteenth Year With A Program Called Zee Mahotsavam-పదహారు ఏళ్లలోకి జీ మహోత్సవం’ అనే కార్యక్రమంతో అడుగుపెడుతున్న జీ తెలుగు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జీ తెలుగు ప్రసారం చేస్తున్న అద్భుతమైన సీరియల్స్‌ ద్వారా.ఆ సీరియల్స్‌లోని నటులు మన జీవితంలో.మనం మర్చిపోలేని వ్యక్తులుగా.ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో మనుషులుగా మారారు.

‘జీ మహోత్సవం’, ప్రభుత్వం విధించిన కోవిడ్ – 19 రూల్స్ ని పాటిస్తూ జరిపారు.అలీ, బుల్లి తెర మెగాస్టార్ ప్రభాకర్ మరియు జీ తెలుగు కుటుంబం అంతా కలిసి జరుపుకునే వేడుక ఈ జీ మహోత్సవం.

అభిమాన నటీనటుల ఆట పాటలతో పాటు ఎంతో భావోద్వాగాలకు గురిచేసే మరెన్నో క్షణాలను మన ముందుకు తేనుంది ఈ కార్యక్రమం.అంతే కాకుండా, తెలియచేస్తారు.

పవన్, తనూజ మునుపెన్నడూ చూడని రీతిలో వారి అభిమానులని అలరించనున్నారు.అలాగే, జీ తెలుగు లోని 16 ఎప్పటికీ నిలిచిపోయే షోస్ టైటిల్ సాంగ్స్ ను పదహారు నిముషాలు మనకు ఎంతో ఇష్టమైన నటి నటులు పెర్ఫర్మ్ చేయగా, అందరు కలిసి అలీ తో కేక్ కట్ చేసి జీ ​తెలుగు తో వారి అనుబంధం.

తెలుగు క్లస్టర్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ, “ఇపుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒకరు కూడా కొద్దిగా ఊరట కోరుకుంటున్నారు.జీ తెలుగు ఎపుడు కూడా అందరి సంక్షేమం కోసం తోడ్పడుతుంది.

అందుకే ఇలాంటి పరిస్థితిలో కూడా జీ తెలుగు కుటుంబం అందరు కలిసి మా ప్రియతమా అభిమానుల కోసం జీ మహోత్సవం కార్యక్రమంతో అలరించడానికి వస్తుంది.ప్రభుత్వం విధించిన కోవిద్ -19 విధి విధానాలు పాటిస్తూ, ఈ కార్యక్రమం జరపడం జరిగింది.

ఇంత వరకు మాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపునుంచి యావత్ జీ తెలుగు నుంచి కూడా ధన్యవాదములు.అలాగే, ఇప్పుడు ఉన్న కఠినమైన పరిస్థితులలో మనమందరం కలిసి కరోనాతో పోరాడాలి.అదే మీ నేస్తంగా మేము కోరుకునేది, ఇంట్లోనే ఉండండి, మాస్క్ ధరించండి.”

ఈ ఆదివారం మే 16 న తప్పక వీక్షించండి ‘జీ మహోత్సవం’ మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానల్లలో సాయంత్రం 5 గంటలకు.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.

నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.

విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.

ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు