మరో ఆఫర్‍‍ను తీసుకొచ్చిన జీ పే..!

Zee Pay Brings Another Offer

భారత ప్రభుత్వం చొరవతో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.వాస్తవానికి ఇప్పుడు అన్ని నగదు రహిత లావాదేవీలే జరుగుతున్నాయి.

 Zee Pay Brings Another Offer-TeluguStop.com

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భారత్ పే వంటి యూపీఐ పేమెంట్స్ యాప్స్‌లను భారత దేశంలో కోట్లాది మంది ప్రజలు విరివిగా వాడుతున్నారు.అయితే ఆ అన్ని అప్లికేషన్లలో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల యాప్ గూగుల్ పే బాగా పాపులర్ అయింది అని చెప్పుకోవచ్చు.

ఇందుకు కారణం గూగుల్ పే ఆకర్షణీయమైన ఆఫర్లను వినియోగదారులకు అందిస్తుంటుంది.

 Zee Pay Brings Another Offer-మరో ఆఫర్‍‍ను తీసుకొచ్చిన జీ పే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా కూడా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది.

స్క్రాచ్ కార్డుల ద్వారా రివార్డ్స్ తీసుకు వచ్చామని ప్రకటించింది.నిజానికి చాలా రోజులుగా స్క్రాచ్ కార్డు ఆఫర్ ను గూగుల్ పే అందిస్తోంది.

కానీ ఈ స్క్రాచ్ కార్డు ద్వారా మనీ గెలుచుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.నూటికి 99 శాతం మంది ‘బెటర్ లక్ నెక్స్ట్ టైమ్’ అని మెసేజ్ చూసి బాగా నిరాశ పడిపోయారు.

ఈ నేపథ్యంలో యూజర్లకు ఎంతో కొంత డబ్బులు కచ్చితంగా ఆఫర్ చేసేందుకు గూగుల్ సంస్థ సిద్ధమైంది.

క్రికెట్ ప్రియులను ఆకర్షించేలా ‘ఫ్యాన్ వాల్ ఆఫర్’ అనే ఓ స్క్రాచ్ కార్డు గేమ్ ను తీసుకొచ్చింది.ఈ గేమ్ రూల్స్ ప్రకారం యూజర్లు 6 పేమెంట్స్ చేస్తే ఓ స్క్రాచ్ కార్డు గెలుపొందచ్చు.ఆ కార్డును స్క్రాచ్ చేస్తే రూ.600 వరకూ రివార్డులు గెలుచుకోవచ్చు.మీరు కూడా ఒకసారి ప్రయత్నించి రూ.600 వరకూ సంపాదించండి.గూగుల్ పే అప్లికేషన్ ద్వారా మీరు మొబైల్, డీటీహెచ్, గ్యాస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేమెంట్స్ చేసుకోవచ్చు.

అవసరమైన చిన్న పేమెంట్స్ జరిపి ఫ్యాన్ వాల్ ఆఫర్ ద్వారా బెనిఫిట్స్ పొందవచ్చు.

#Google Pay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube