ఎట్టకేలకు ఆ ఓటీటీకి రాజమౌళి దయతో సక్సెస్‌ పడబోతుందా?

ప్రస్తుతం ఇండియాలో ఓటీటీ అనగానే ఎక్కు మందికి గుర్తుకు వచ్చేవి అమెజాన్ మరియు హాట్‌ స్టార్‌.ఈ రెండిటి తర్వాత కొందరు నెట్‌ ఫ్లిక్స్ అని కూడా అంటారు.

 Zee 5 Ott Going To Top In India With Raja Mouli Rrr Movie , Film News, Rrr News,-TeluguStop.com

కాని జీ5 కూడా చాలా కాలంగా ఓటీటీ గా సేవలు అందిస్తుంది.చాలా షో లు మరియు సినిమాలు కూడా దాని ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

కాని ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా జీ5 కి ఆధరణ కలిపించడం లేదు.దాంతో జీ 5 సంస్థను కష్టంగానే జీ సంస్థ నెట్టుకు వస్తుందనే వార్తలు పుకార్లు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో జీ 5 సంస్థ తీసుకున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ఆ సంస్థకు ఇప్పుడు ఆశా జ్యోతిగా మారింది.మొట్ట మొదటి సారి ఒక భారీ ప్రాజెక్ట్‌ ను దక్కించుకున్న ఆ సంస్థ ఈసారి ఖచ్చితంగా సక్సెస్‌ ను దక్కించుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కారణంగా చాలా ఓటీటీ లకు మంచి రోజులు వచ్చాయి.తెలుగు స్పెషల్‌ ఓటీటీ అయిన ఆహా వారు కూడా మంచి కంటెంట్ తో మంచి గుర్తింపును దక్కించుకున్నారు.

జీ 5 సంస్థ తీసుకు వచ్చిన ఏ ఒక్క సినిమా కాని సిరీస్‌ కాని ఇప్పటి వరకు మంచి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.దాంతో రాజమౌళి దయతో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా వల్ల జీ 5 సంస్థ ఖచ్చితంగా మరో రేంజ్‌ లో కి వెళ్లడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం ఇండియా లో ఓటీటీ టాప్ జాబితాలోకి ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కారణంగా జీ 5 సంస్థ చేరడం ఖాయంగా కనిపిస్తుంది.పెద్ద ఎత్తున రూపొందుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ తర్వాత ఓటీటీ ద్వారా విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube