మగరాయుడిని అంటున్న హాట్ హీరోయిన్.. వైరల్ కామెంట్స్!

బాలీవుడ్ హాట్ గ్లామర్ హీరోయిన్ జరీనా ఖాన్.బాలీవుడ్ కు పరిచయమున్న పేరే.2010లో సల్మాన్ ఖాన్ నటించిన వీర్ సినిమా లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత రెడీ, హౌస్ ఫుల్ 2 పలు సినిమాల్లో నటించగా.

 Zareen Khan To Play Lesbian On Silverscreen-TeluguStop.com

నిజానికి ఈమె ను చూడటానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ లా ఉంటుంది.ఇక చాలామంది ఈమెను కత్రినా తో కూడా పోల్చారు.గతంలో ఈ విషయం పట్ల తాను ఎంతో ఫీల్ అయిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.తనను తానుగా నిరూపించుకునే అవకాశం ఇవ్వలేదని బాగా ఫీల్ అయ్యిందట‌.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ మగరాయుడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

 Zareen Khan To Play Lesbian On Silverscreen-మగరాయుడిని అంటున్న హాట్ హీరోయిన్.. వైరల్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


ఇటీవలే తను స్వలింగ సంపర్కురాలిగా.

ఓ సినిమాలో నటించగా అందర్నీ ఆశ్చర్యపరిచింది.అంతేకాకుండా తాను నటించబోయే మరో సినిమా లో హాట్ పాత్రలో కనిపించనుందట.

ఈ విషయం గురించి కొన్ని విషయాలు పంచుకున్న ఈ బ్యూటీ కొన్ని పాత్రల్లో తనని చూడటానికి చాలా అనుమానాలు ఉన్నాయని, గ్లామర్ గా దూరంగా ఉంటే పాత్రల్లో చూడటానికి ఇష్టపడరని తెలిపింది.తాను ప్రతిసారీ విభిన్నమైన పాత్రలో నటిస్తే ఆమెకు సందేహాలు ఎదురవుతుంటాయని తెలిపింది.


కానీ తన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత తన ప్రతిభను ప్రశంసిస్తూ తన పాత్రను మెచ్చుకుంటారని తెలిపింది.ప్రస్తుతం లెస్పియన్ గా తొలిసారిగా కనిపించనున్నానని తెలిపింది.తనకు పాత్రలో నటించడానికి ఎటువంటి సందేహాలు, అనుమానాలు లేవని చెప్పేసింది.ఇక ఈ పాత్ర కోసం తనను ఆడిషన్ కి పిలిచినప్పుడు చాలా సంతోషంగా ఉందని, ఈ పాత్రకి సరైన న్యాయం చేయాలని సిద్ధంగా ఉన్నానని తెలిపింది.

తన టాలెంట్ చూసి ఆఫర్ చేశారని తెలిపింది.


ఇక స్వలింగ సంపర్కురాలి పాత్రలో నటించడం కష్టమైన విషయమే అంటూ.

తన జీవితంలో చాలా భాగం మగరాయుడిలా బతికానని తెలిపింది.ఇక ప్రస్తుతం నటించిన సినిమాల్లో తన బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చుకుంటున్నాంటూ ఈ పాత్ర ద్వారా మహిళల లక్షణాలు అలవాటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడిందని తెలిపింది.

లెస్పియన్ పాత్రలో నిజమైన ప్రేమ పంచడానికి సిద్ధంగా ఉన్నాంటూ.తను హోమోసెక్సువల్ కాదని స్క్రీన్ మీద సహజంగా, నిజాయితీ గా నటించడానికి ప్రయత్నిస్తున్నానంటూ.

ఈ పాత్రలో తను ఎలిజిబిలిటీ కమ్యూనిటీకి ఆగ్రహం కలగవచ్చని తెలిపింది.

#Lesbian #Lesbian Role #Silver Screen #ZareenKhan #AkeleHum

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు