ఈ బొద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా..?  

Zareeba Khan Bollywood Actress - Telugu Bollywood Actress, Chanakya, Telugu Actress, Without Makeup Photos, Zareeba Khan

తెలుగులో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించినటువంటి చాణిక్య అనే చిత్రంలో పాకిస్థాన్ దేశంలో రహస్య గూడచారిగా పని చేస్తున్నటువంటి యువతి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించినటువంటి బాలీవుడ్ నటి జరీనా ఖాన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రం పెద్దగా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయినప్పటికీ జరీనా ఖాన్ పాత్రకి  మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.

 Zareeba Khan Bollywood Actress

అయితే తాజాగా జరీనా ఖాన్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఆ ఫోటోలు  జరీనా ఖాన్ సినిమాల్లోకి రాకముందు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ వేడుకలో దిగినట్లు పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

అంతేగాక ఈ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే జరీనా ఖాన్ సినిమాల్లోకి రాకముందు చాలా బరువు ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి కూడా అప్పట్లో జరిగిన కాని స్పందిస్తూ తాను సినిమాల్లోకి రాకముందు చాలా బరువు ఉండేదానినని కేవలం సినిమాల్లో నటించాలనే కోరికతో దాదాపుగా 20 నుంచి 30 కేజీల పాటు బరువు తగ్గానని చెప్పుకొచ్చింది.

ఈ బొద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా..-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా జరీనా ఖాన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.ఇందులో భాగంగా ఓ నెటిజన్ టాలీవుడ్ సినీ పరిశ్రమపై  మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరాడు.

దీంతో జరీనా ఖాన్ టాలీవుడ్ హీరోలకి క్రమశిక్షణ చాలా ఎక్కువని చెప్పుకొచ్చింది.అంతేకాక సమయాన్ని మరియు ఆర్టిస్టులను బాగా ఉపయోగించుకుంటారాని తెలిపింది.

దీనికి తోడు ఇతర భాషా చిత్ర పరిశ్రమల ఆర్టిస్టులను చాలా గౌరవిస్తారని, ఆ విషయం తనకు ఎంతో బాగా నచ్చిందని కూడా చెప్పుకొచ్చింది.అలాగే తనకి తెలుగు సినిమాల్లో నటించాలని ఉందని అలాగే  తనకి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం వస్తె కచ్చితంగా నటిస్తానని తెలిపింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test